'అరవింద సమేత'లో లోపాలు వెతికిన జగపతి బాబు
టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా నెగిటివ్ రోల్స్ తో తనకంటూ ఒక క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు హీరోగా కన్నా.. ఇప్పుడే జగపతి బాబుకి మంచి క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. లెజెండ్ సినిమా నుంచి మంచి ఫామ్ లో ఉన్న ఆయన లాక్ డౌన్ సమయంలో కొత్త తరహా పద్ధతులను పాటిస్తున్నారు.
రోజు పనిలో పడి మనల్ని మనం చెక్ చేసుకోవడం మర్చిపోతున్నాం అంటూ.. ఈ లాక్ డౌన్ సమయాన్ని రేపటికి ఉపయోగపడేలా జగపతిబాబు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇకపోతే రీసెంట్ గా ఆయన నటించిన సినిమాలను ఎక్కువగా చూస్తూ అందులో లోపాలని పసిగడుతున్నారట. ఇక అరవింద సమేత సినిమాలో జగపతి తన క్యారెక్టర్ పై కాస్త అసంతృప్తిగానే మాట్లాడారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో జగపతిబాబు భయంకరమైన ఫ్యాక్షనిస్ట్ విలన్ పాత్రలో డిఫరెంట్ గా కనిపించారు. అయితే సినిమాను పూర్తిగా చూసిన తరువాత మరికొన్ని సన్నివేశాల్లో ఇంకా ఇన్వాల్ అవ్వాల్సిందని, అందుకు కారణం ఆ రోజు నా మూడ్ బాగాలేదని అన్నారు. అందుకే నెక్స్ట్ టైమ్ నుంచి రిలాక్స్ గా ఉండటానికి ప్రయత్నం చేస్తానని జగపతిబాబు వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











