'కరెంటు తీగ' లో జగపతిబాబు లుక్ ఇదే(ఫొటో)

By Bojja Kumar

హైదరాబాద్ : మంచు విష్ణుతో 'దేనికైనా రెడీ' అనిపించారు జి.నాగేశ్వరరెడ్డి. ఇప్పుడు తమ్ముడు మనోజ్‌తో షాక్‌ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మంచు మనోజ్‌ - జి.నాగేశ్వరరెడ్డి కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'తో ఆకట్టుకొన్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్ . ఈ చిత్రానికి 'కరెంటు తీగ' అనే టైటిల్ ని ఖరారు చేసిన టీజర్ రిలీజ్ చేసారు. ఇప్పుడు ఆ చిత్రంలో కీలకమైన పాత్ర చేస్తున్న జగపతి బాబు ఫస్ట్ లుక్ ని వదిలారు.

ఈ సినిమాని మంచు విష్ణు24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ‘ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఈ సినిమాని అక్టోబర్ 2న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. మంచు మనోజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే సినిమా కరెంట్ తీగ ' అని మంచు విష్ణు అన్నాడు.

మంచు మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి జి. నాగేశ్వరరెడ్డి డైరెక్టర్. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీలో హాట్ బ్యూటీ సన్నీ లియోన్ అతిధి పాత్రలో కనిపించనుంటే, శిల్పి శర్మ ఓ ఐటెం సాంగ్ లో కనిపిచనుంది.

Jagapathi Babu in Current Theega!
ప్రస్తుతం మనోజ్ దృష్టి మొత్తం ఆయన తాజా చిత్రం కరెంట్‌తీగ పై ఉంది. ఆ చిత్రంలో తన పాత్ర గురించి చెప్తూ... పాండవులు పాండవులు తుమ్మెద తరువాత కరెంట్‌తీగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. దీనికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు విష్ణు అన్నయ్యతో దేనికైనా రెడీ వంటి సూపర్‌డూపర్ హిట్టిచ్చారాయన. ఇప్పటి వరకు నేను పనిచేసిన దర్శకుల్లో కరెక్ట్‌గా నా బెండుతీసి నాతో వర్క్ చేయించుకుంటున్నారు. రాఘవేంద్రరావు, చంద్రశేఖర్ ఏలేటిల తరువాత జి.నాగేశ్వరరెడ్డి అంతబాగా అంకిత బావంతో పనిచేస్తున్నారు.

సినిమా చాలా బాగా వస్తోంది. ఇందులో ఫుల్ ఎనర్జీతో రఫ్ అండ్ టఫ్‌గా వుండే ఓ పల్లెటూరి యువకుడిగా కనిపిస్తాను. దేవుడి దయవల్ల సినిమా బాగా వస్తోంది. ఇందులో జగపతిబాబుగారు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ప్రత్యేక పాత్రలో సన్నిలియోన్ నటిస్తోంది. ఆమె పాత్రకున్న ప్రాముఖ్యత ఎలాంటిదో చెప్పడం కంటే సినిమా చూస్తేనే అర్థమవుతుంది అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X