»   » ఎన్నారైతో జగపతి బాబు కుమార్తె వివాహం

ఎన్నారైతో జగపతి బాబు కుమార్తె వివాహం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు పెద్ద కుమార్తె మేఘన అమెరికాకు చెందిన ఎన్నారైని ఆదివారం పెళ్లాడుతోంది. హైదరాబాద్ లోని వెస్టిన్ హోటల్ ఇందుకు వేదిక అయింది. అమెరికాలో ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేసిన మేఘన అక్కడే ఓ ఎన్నారైతో ప్రేమలో పడింది. తండ్రి జగపతి బాబుతో పాటు ఇతర కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అంగరంగ వైభవంగా ఈ రోజు వివాహం జరుగుతోంది. ఆదివారం రాత్రి జరిగే ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాల నుండి ప్రముఖులు హాజరుకానున్నారు. పూర్తి ప్రైవేట్ కార్యక్రమంగా ఈ వేడుక ప్లాన్ చేసారు. వివాహం అయిన తర్వాత మీడియాకు ఫోటోలు విడదల చేయనున్నారు.

Jagapathi Babu Daughter's Marriage news
English summary
Jagapathi Babu's elder daughter Meghana is getting married today to a friend she loved while in USA.
Please Wait while comments are loading...