చిరంజీవి స్క్రిప్టుతో జగపతి బాబు

By Staff

Jagapathi Babu
జగపతిబాబు, వి.సముద్ర దర్శకత్వంలో అధినేత టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం స్క్రిప్టు గతంలో అధినాయుకుడు పేరుతో చిరంజీవికి పరుచూరి వారు వండినదే అని ఫిల్మ్ నగర్ సమాచారం. ఎన్.శంకర్ దర్శకత్వంలో చేద్దామని,ప్రజారాజ్యం పార్టీ సిద్దాంతాలను అంతర్గతంగా చొప్పించి తయారు చేసిన స్క్రిప్టు అది అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే రకరకాల కారణాల వల్ల అది మెటీరియలైజ్ కాలేదు. అయితే ఈ మధ్య వరస ఫ్లాఫుల్లో ఉన్న సముద్ర పరుచూరి వారిని కలిసి మంచి స్క్రిప్టు ఇమ్మని అడిగితే వారు అది తీసి కొద్దిగా రిఫైన్ చేసి అతనికిచ్చారని చెప్తున్నారు.

ఇంతకు ముందు ఎవడైతే నాకేంటి(రాజశేఖర్ హీరో)సినిమా అప్పుడు పరుచూరి వారు,సముద్ర కలిసిపనిచేసారు. ఆ చనువుతో పొలిటికల్ స్క్రిప్టు బాగా డీల్ చేస్తావని వారు చెప్పారుట. అందులోనూ ఎవడైతే నాకేంటిలో హీరో హోం మినిస్టర్ అయితే ఇందులో హీరో సిఎం అయి ప్రజలకు గొప్ప పాలన అందిస్తాడు. అందులోను హీరో సామాన్యుడు కావటం ఇందులో కీలకాంశంట. ఇక చిరు చేయాల్సిన స్క్రిప్టుని జగపతిబాబు ఎట్లా జీవించి చేస్తాడో చూడాలంటున్నారు. అంతేగాక ఆ సినిమాలో ప్రజారాజ్యం సిద్దాంతాలు తొలిగించారో లేదోనన్న అనుమానం కొందరికి ఉంది. ఏదైమైనా ఎలక్షన్స్ ముందు వస్తే సినిమా వర్కవుట్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X