»   »  అభిమానులకు కన్నీళ్లు పెట్టిస్తున్న జగపతి బాబు రియల్ లైఫ్

అభిమానులకు కన్నీళ్లు పెట్టిస్తున్న జగపతి బాబు రియల్ లైఫ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు సినిమా కెరీర్ ప్రస్తుతం మంచి జోరుమీదే ఉంది. హీరో పాత్రలను వదిలేసి....విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేయడం మొదలు పట్టాక అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇటీవలే జగపతి బాబు కూతురు వివాహం కూడా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు.

ఈ విషయాలను గమనిస్తున్న చాలా మంది జగపతి బాబు ఎలాంటి బాధలు, టెన్షన్లు లేకుండా కూల్ లైఫ్ అనుభవిస్తున్నారని అనుకుంటారు. అయితే కొందరికి మాత్రమే తెలుసు ఆయన గుండె ఎంత బాధగా, బరువుగా ఉందో. ఇటీవల జరిగిన ఓ సంఘటన ఆయన గతంపై ఫిల్మ్ నగర్లో చర్చసాగడానికి కారణమైంది.

Jagapathi Babu

జగపతి బాబు తండ్రి దివంగత, ప్రముఖ నిర్మాత వీరమాచినేని బాబు రాజేంద్ర ప్రసాద్ తన కెరీర్లో ఎన్నో హిట్స్ ఇచ్చారు. జగపతి బాబు పుట్టకతోనే దనవంతుడు. చిన్నతనంలో, టీనేజీలో ఎంతో గొప్పగా బ్రతికాడు. తండ్రి నిర్మాత కావడంతో హీరోగా పరిచయం అయ్యాడు. అప్పట్లో ఫ్యామిలీ హీరోగా జగపతి బాబు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే పరిస్థితులు తిరగబడటంతో జగపతి బాబు కష్టాల్లో పడింది. ఆ సమయంలో వారి ఫ్యామిలీకి కొందరు సహాయంగా నిలిచాన కష్టాలు తీరలేదు. దీంతో జూబ్లీహిల్స్ లోని తమ సొంత ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది. తర్వాత జగపతి బాబు కూకట్ పల్లిలోని మూడు బెడ్ రూమ్స్ ఉన్న ఇంటికి షిప్టయింది.

ఇటీవల చిన్నతనంలో తాను పెరిగిన తమ సొంతింటి వైపు వెళ్లిన జగపతి బాబు...కారు దిగి ఆ ఇంటి వైపు అలానే చూస్తూ ఉండి పోయారట. చిన్నతనంలో జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయట. దీన్ని చూసిన పలువురు జగపతి బాబు గతాన్ని గుర్తు చేసుకున్నారు. జగపతి బాబు మంచి మంచి ఆఫర్లు దక్కించుకుని బాగా డబ్బు సంపాదించి తమ సొంత ఇంటిని మళ్లీ దక్కించుకోవాలని పలువురు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

English summary
Actor was born as rich kid and had lavish life in childhood and also at teenage. But unfortunately time turned against the family.With sudden crisis and debts Babu’s family struggled to survive. To overcome from crisis they sold Dream house at Jublee Hills. Now Jagapati is living with his family in a three bed room flat at Kukatpally.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu