పవన్ కళ్యాణ్ తో తమ్ముడు చిత్రాన్ని రూపొందించిన అరుణ్ ప్రసాద్ ఇప్పుడు జగపతిబాబుతో సినిమా చేయనున్నారని సమాచారం. ఇప్పటికే బ్రహ్మానందంతో ప్రారంభించిన గోకరాజు సినిమా ఆగిపోయింది. కాంగ్రెస్ పార్టి ప్రచార చిత్రంగా ఆ చిత్రం పూర్తి చేస్తానని వైయస్ ని, సి.సి.రెడ్డి గారిని ఒప్పించాడు. కానీ ముందనుకున్న బడ్జెట్ పూర్తయినా సగం కూడా పూర్తి కాకపోవటంతో ఆగిపోయింది. అది ప్రక్కన పెట్టి భూమిక, నవదీప్ ప్రధాన పాత్రల్లో యాగం చిత్రం ప్రారంబిచాడు. అదీ అటు ఇటు కాకుండా ఆగిపోయింది. దాంతో మరో నిర్మాతను పట్టి కేవలం ముప్పై రోజుల్లో సినిమా పూర్తి చేస్తానని చెప్పి ఒప్పించాడు. మంచి మెసేజ్ సినిమా అని తమ్ముడు చిత్రం హిట్ ని మరో సారి గుర్తు చేసి జగపతిని ఒప్పించాడు. అలా ప్రారంభమయ్యే ఈ చిత్రం ఎక్కడకి తీసుకెళ్తాతడని అంతా అంటున్నారు. మే నెలలో ప్రారంభమయ్యే ఈ చిత్రం జూన్ పదిహేను తేదిన పూర్తి అవుతుందని చెప్తున్నారు. దసరా కి రిలీజ్ ప్లాన్ చేస్తున్న చిత్రం కొత్త నిర్మాతలు ప్రోడ్యూస్ చేయనున్నారని సమాచారం.