Just In
- 7 min ago
మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల రామ్ సినిమా: కొత్త మూవీ విడుదలకు డేట్ ఫిక్స్
- 38 min ago
Box office: పది రోజులైనా తగ్గని క్రాక్ హవా.. మొత్తానికి మాస్టర్ పనైపోయింది
- 54 min ago
సిగరెట్ తాగుతూ బోల్డ్ మాటలు.. షాక్ ఇచ్చిన రేసుగుర్రం మదర్ పవిత్ర.. రెడ్ రెమ్యునరేషన్ ఎంత?
- 2 hrs ago
దానికి రెడీ అంటూ అలీకి షాకిచ్చిన షకీలా: తెలుగు డైరెక్టర్ ఫోన్.. మోసం చేసింది ఆయనంటూ లీక్ చేసింది
Don't Miss!
- Sports
అతని గురించి ఎంత చెప్పినా తక్కువే.. శరీరానికి ఎన్ని దెబ్బలు తగిలినా మ్యాచ్ కాపాడాడు: గవాస్కర్
- News
Actress: స్టార్ హోటల్ లో చిత్రాతో ఏం జరిగిందో మొత్తం చెప్పాడు, సీక్రెట్ గా రికార్డు చేసి రిలీజ్ చేసిన ఫ్రెండ్
- Finance
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు: ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7000 తక్కువ
- Automobiles
స్పోర్ట్స్ కార్లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జూ ఎన్టీఆర్ చాలాసార్లు చెప్పాడు..జగపతి బాబు
ఎన్టీఆర్ చాలాసార్లు 'మీరు గాయం తరహా చిత్రాలు చెయ్యాలన్నయ్యా' అని చెప్పాడు. ఆ ఆలోచనలో ఉన్నప్పుడు ఈ స్క్రిప్ట్ తీసుకొచ్చాడు ప్రవీణ్ అంటూ జగపతి బాబు తన తాజా చిత్రం 'గాయం 2' గురించి మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. అలాగే...ఒక సీక్వెల్ చిత్రానికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆ స్క్రిప్ట్‌లో కనిపించాయి. ఒక రకంగా నా డ్రీమ్ రోల్ కూడా ఇదే. ఒక మంచి విజయం దక్కాలనే కసితో పని చేశా. 'గాయం' చిత్రాన్ని టీవీల్లో చూసిన చాలా మంది ఇలాంటి సినిమా చెయ్యాలని అడుగుతుంటారు. ఇళయరాజా సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నారు అన్నారు.
ఇక చిత్ర సమర్పకులు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ...మొదట 'గాయం 2' అనే ఆలోచన గురించి జగపతిబాబు చెప్పినప్పుడు నేను వద్దన్నాను. 'గాయం' వచ్చి ఇప్పటికి పదిహేనేళ్లు అయ్యింది. ప్రేక్షకుల్ని ఎలా ఒప్పించాలీ అన్నాను. ప్రవీణ్ కలిసి ఒకసారి ఈ స్క్రిప్ట్ గురించి చెప్పాడు. దుర్గ పాత్రను అతను మలచిన విధానం చాలా ఆసక్తిగా అనిపించింది. సాంకేతిక విలువలు కూడా చాలా బాగున్నాయన్నారు.
'గాయం 2' లో కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, రేవతి, అజయ్, జీవా, హర్షవర్ధన్, పవన్‌శ్రీరామ్ తదితరులు ఇతర పాత్రధారులు. ఛాయాగ్రహణం: అనిల్ బండారి, కూర్పు: ప్రవీణ్‌రెడ్డి, రచన: రవిరెడ్డి మల్లు, గంధం నాగరాజు, స్క్రీన్‌ప్లే: రాజేంద్రరెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: భరత్ చౌదరి. ప్రవీణ్ శ్రీ దర్శకుడిగా కర్త క్రియేషన్స్ పతాకంపై డా||ధర్మకర్త నిర్మిస్తున్నారు.