twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జగపతిబాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు

    By Srikanya
    |

    హైదరాబాద్ వేరే హీరోల సినిమాలకు మరో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వటం కామన్ గా మారింది. తాజాగా జగపతిబాబు 'కాళిచరణ్‌' చిత్రానికి తన వాయిస్ ని ఇస్తున్నారు. కరుణాలయం ప్రొడక్షన్స్‌ పతాకంపై వర్మ శిష్యుడు, 'గాయం-2' ఫేం శ్రీప్రవీణ్‌ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. చైతన్య కృష్ణ హీరో. చాందిని, కవిత హీరోయిన్స్ .

    దర్శకుడు మాట్లాడుతూ-''తెలుగు, తమిళ్‌ ద్విభాషా చిత్రమిది. తమిళ్‌లో నామక్కల్‌ ప్రాంతం నేపథ్యంలో, తెలుగులో పాలమూరు నేపథ్యంలో కథ సాగుతుంది. యథార్థ కథ ఆధారంగా తమిళ్‌లోనే కాదు..తెలుగులోనూ సినిమాలొస్తాయని చెప్పడానికే ఈ సినిమా చేశాను. త్వరలో సెన్సార్‌కెళుతున్నాం. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎర్రసత్యం అనే నిజపాత్ర ఉంది. ఆ పాత్ర చాలా ఆసక్తికరం. అతడిని ఏపీ సహా తమిళనాడులోనూ చూపిస్తున్నా. ఏపీలో దిల్‌రాజు, బాలీవుడ్‌లో అనురాగ్‌ కశ్యప్‌, తమిళ్‌లో శశి పంపిణీ చేస్తున్నారు. గురూజీ వర్మ కూడా ఈ చిత్రం చూసి మెచ్చుకున్నారు'' అన్నారు.

    దిల్‌రాజు మాట్లాడుతూ-''యథార్థగాదలు తెలుగులో తక్కువ. తమిళ్‌లో ఎక్కువ. 80ల నాటి వాతావరణాన్ని దర్శకుడు యథాతథంగా చూపి బాల్యాన్ని గుర్తుచేశారు'' అన్నారు. 80లలో జరిగిన ఓ యథార్థగాద ఆధారంగా రూపొందించిన ద్విభాషా చిత్రం 'కాళిచరణ్‌'.

    కృష్ణచైతన్య మాట్లాడుతూ-''శ్రీప్రవీణ్‌ డ్రీమ్‌ప్రాజెక్ట్‌ ఇది. 10నెలలు కష్టించి పా త్రకోసం గడ్డాలు, మీసాలు పెంచాను'' అన్నా రు. కెమెరా: విశ్వ దేవబత్తుల, సతీష్‌ ముత్యాల, సంగీతం: నందన్‌రాజ్‌, పాటలు: వనమాలి, సదాచంద్ర, కళ: నారాయణ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: అజయ్‌సాయి, ఫైట్స్‌: వెంకట్‌నాగ్‌. సమర్పణ: బేబి మనస్విని.

    English summary
    
 Sri Prawin’s upcoming film Kaalicharan has a new addition, although only in the form of a voice-over. The latest news is that Jagapathi Babu has given a voice over for the film and his voice will be heard in the opening scene where he introduces the story. Chaitanya Krishna and Chandini have played the lead roles in the film whereas Bhojpuri actor Pankaj Kesari is making his debut as a villain. Kavita Srinivasan has played an important role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X