Don't Miss!
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
జగపతిబాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు
దర్శకుడు మాట్లాడుతూ-''తెలుగు, తమిళ్ ద్విభాషా చిత్రమిది. తమిళ్లో నామక్కల్ ప్రాంతం నేపథ్యంలో, తెలుగులో పాలమూరు నేపథ్యంలో కథ సాగుతుంది. యథార్థ కథ ఆధారంగా తమిళ్లోనే కాదు..తెలుగులోనూ సినిమాలొస్తాయని చెప్పడానికే ఈ సినిమా చేశాను. త్వరలో సెన్సార్కెళుతున్నాం. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎర్రసత్యం అనే నిజపాత్ర ఉంది. ఆ పాత్ర చాలా ఆసక్తికరం. అతడిని ఏపీ సహా తమిళనాడులోనూ చూపిస్తున్నా. ఏపీలో దిల్రాజు, బాలీవుడ్లో అనురాగ్ కశ్యప్, తమిళ్లో శశి పంపిణీ చేస్తున్నారు. గురూజీ వర్మ కూడా ఈ చిత్రం చూసి మెచ్చుకున్నారు'' అన్నారు.
దిల్రాజు మాట్లాడుతూ-''యథార్థగాదలు తెలుగులో తక్కువ. తమిళ్లో ఎక్కువ. 80ల నాటి వాతావరణాన్ని దర్శకుడు యథాతథంగా చూపి బాల్యాన్ని గుర్తుచేశారు'' అన్నారు. 80లలో జరిగిన ఓ యథార్థగాద ఆధారంగా రూపొందించిన ద్విభాషా చిత్రం 'కాళిచరణ్'.
కృష్ణచైతన్య మాట్లాడుతూ-''శ్రీప్రవీణ్ డ్రీమ్ప్రాజెక్ట్ ఇది. 10నెలలు కష్టించి పా త్రకోసం గడ్డాలు, మీసాలు పెంచాను'' అన్నా రు. కెమెరా: విశ్వ దేవబత్తుల, సతీష్ ముత్యాల, సంగీతం: నందన్రాజ్, పాటలు: వనమాలి, సదాచంద్ర, కళ: నారాయణ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డాన్స్: అజయ్సాయి, ఫైట్స్: వెంకట్నాగ్. సమర్పణ: బేబి మనస్విని.