పులి లేదు... ఖలేజా లేదు...జగపతి బాబుదే హవా..
జగపతి బాబు కథానాయకుడిగా రామ్ గోపాల్ వర్మ సమర్పణలో కర్త క్రియేషన్స్ పతాకంపై రూపొందు తున్న చిత్రం 'గాయం-2. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూ పొంది సంచలనం సృష్టించిన 'గాయం చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా ప్రవీణ్ శ్రీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. డా ధర్మకర్త నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. వచ్చే వారం ఆడియోను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్బంగా రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ 'జగపతి బాబు మొదట 'గాయం చిత్రానికి సీక్వెల్ చేయాలను కుంటున్నానని చెప్పినపుడు అనవ సర ప్రయత్నమని వారించాను. అయితే జగపతిబాబు 'అప్పటి 'గాయం చిత్రంలో చూపించినట్లుగా నేటి సమాజంలో పరిస్థితులు అలాగే వ్ఞన్నాయని, ఆ చిత్ర కథాంశానికి సమకాలీనతను ఆపాదిస్తూ తీస్తే తప్పకుండా గొప్ప చిత్రమవుతుందని మెప్పించాడు అన్నారు.
జగపతి బాబు మాట్లాడుతూ "గాయం చిత్రంలోని దుర్గ పాత్ర పరిశ్రమలో నాకు హీరోగా సరికొత్త గుర్తింపు నిచ్చింది. నాకో స్టార్ డమ్ ను తెచ్చిపెట్టింది. 'గాయంలోని దుర్గ పాత్ర నా డ్రీమ్ రోల్. 'గాయం-2 చిత్రం కోసం మంచి టెక్నికల్ టీమ్ దొరికింది. సంవత్సరం మొత్తం ఈ చిత్రం కోసం కష్టపడ్డాను. 'గాయం-2 నాకు నటుడిగా పునర్జన్మనిస్తుందన్న నమ్మకముంది. తెలుగు సినీ చరిత్రలోనే 'గాయం-2 అందరు మెచ్చే గొప్ప సీక్వెల్ అవుతుంది.
కాగా సెప్టెంబర్ చివరిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రానికి కాలం కలిసి వచ్చి సెప్టెంబర్ 3న విడుదలవుతుంది. అందుకు కారణం కొమరం పులి, ఖలేజా చిత్రాల విడుదల ఆలస్యం కావడమే. సో...సెప్టెంబర్ లో పెద్ద సినిమాలు లేకపోతె జగపతిదే హవా.


Click it and Unblock the Notifications











