జగపితి బాబు కెరీర్ పెద్ద ఫెయిల్యూర్(జగపతి) నిచ్చిన జొన్నలగడ్డ శ్రీనివాస్ తో మరో సినిమా చేస్తున్నారు. సీక్రెట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ కొత్త చిత్రం పేరు 'బంగారు బాబు' గా నిర్ణయించారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు కి జంటగా మీరా జాస్మిన్ చేస్తోంది. సాంగ్స్,కొంత పాచ్ వర్క్ మినిహా ఈ సినిమా అంతా పూర్తవటం విశేషం.అలాగే మరో ప్రక్క 'రక్ష' చిత్రం సైలంట్ గా షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఆకెళ్ళ వంశీ కృష్ణ దర్సకత్వంలో రామ్ గోపాల్ వర్మ సమర్పణలో ఈ హర్రర్ చిత్రం ప్రాణం పోసుకుంటోంది. చేతబడి మీద తీస్తున్న ఈ సినిమా యండమూరి 'తులసీ దళం' కు దగ్గరగా ఉంటుందంటున్నారు. ఆగష్టు మూడవ వారంలో రిలీజయ్యే ఈ సినిమా లో కళ్యాణి ముఖ్య పాత్రని పోషిస్తోంది. ఇలా మీడియాకు దూరంగా ఒక దాని తర్వాత మరొకటి సినిమాలు చేస్తూ పోతున్న జగపతిబాబు ని సైలంట్ బాబు అని పిలుస్తున్నారు. అలాగే సైలంట్ గా హిట్స్ ఇవ్వాలని కోరుకుందాం.