త్రిష, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో దిల్ రాజు నిర్మిస్తున్న ఆకాశమంత చిత్రంలో జగపతిబాబు గెస్ట్ గా కనిపించనున్నారని సమాచారం. తమిళంలో రాధా మోహన్ రూపొందించిన అభినయుమ్ నానుమ్ చిత్రం రైట్స్ తీసుకుని కొద్ది మార్పులతో రీ షూట్ చేస్తూ...ఈ చిత్రాన్ని మరింత సుందరంగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. అందునిమిత్తం జగపతిని అడగటం జరిగింది. ఈ నెలఖరు నుండి త్రిష ఈ కాంబినేషన్ షూటింగ్ కి రెడీ జాయిన్ అవుతుంది. ప్రస్తుతం జగపతి బాబు జె.డి చక్రవర్తి దర్శకత్వంలో తయారవుతున్న సిధ్ధం సినిమాలో ఎనకౌంటర్ స్పెషలిస్ట్ గా నటిస్తున్నారు. వచ్చే నెలలో రిలీజ్ కానున్న ఈ చిత్రం అబ్ తక్ చప్పన్ చిత్రానికి ఫ్రీమేక్ అనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
Story first published: Tuesday, January 20, 2009, 9:37 [IST]