జగపతిబాబు...రాజకీయం

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో జగపతిబాబు మాట్లాడుతూ "నా కెరీర్‌లో తొలిసారిగా పూర్తిస్థాయి రాజకీయ చిత్రం చేస్తున్నా. ఒక నిప్పులాంటి యువకుడు రాజకీయాల్లో అడుగుపెట్టి ఏం చేస్తాడు, ఏ స్థాయికి వెళతాడు..అనేది ఈ చిత్ర ప్రధానాంశం. పరుచూరి బ్రదర్స్ రాసిన సంభాషణలు ఈ చిత్రానికి ఎస్సెట్" అని చెప్పారు. 'శివరామరాజు' తర్వాత జగపతిబాబుని ఈ సినిమాలో డైరెక్ట్ చేస్తున్నానని దర్శకుడు సముద్ర తెలిపారు.
రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ "నిజమైన ప్రజాప్రతినిథికి నిర్వచనం చెప్పే సూర్యనారాయణ అనే పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. నేను శ్రీరాములు అనే ఎమ్మల్యే పాత్ర చేస్తున్నా..మా కెరీర్‌లో 'అధినేత' ఒక మైలురాయి అవుతుంది." అన్నారు. శ్రద్ధాదాస్, హంసానందిని హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: శ్రీకాంత్‌దేవా, సినిమాటోగ్రఫీ: ప్రసాద్‌బాబు, ఫైట్స్: డిఫరెంట్ డానీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్. కుమార్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సముద్ర వి. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.మల్లెపూవు అనంతరం సముద్ర దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదే. అలాగే జగపతిబాబు హీరోగా జెడీ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందిన సిద్దం సినిమా ఈ నెల పన్నెండున రిలీజుకి రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications











