సుదీప్, జగపతి బాబు కాంబినేషన్ లో....
బెంగుళూరు : రాజమౌళి సృష్టించిన ఈగతో కన్నడ స్టార్ సుదీప్ కి తెలుగు నాట మంచి క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. సుదీప్, జగపతిబాబు కాంబినేషన్ లో బచ్చన్ అనే చిత్రం తెరకెక్కుతోంది. కన్నడలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులోకి డబ్ అవనుందని సమాచారం. ఇందులో సుదీప్ హీరో కాగా జగపతిబాబు పోలీస్ అధికారిగా కీ రోల్ లో కనిపించనున్నారు. పన్నెండు రోజుల పాటు జగపతిబాబు ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొననున్నారు.
ఇక జగపతిబాబుకి కన్నడంలో మంచి ఫాలో యింగ్ ఉందని, అలాగే సుదీప్ తనకు స్నేహితుడు కావటం వల్లే ఈ సినిమా ఒప్పుకున్నానని అంటున్నారు. అంతేగాక స్క్రిప్టు చదవగానే తనకు కరెక్టుగా సూట్ అవుతుందనిపించిందని చెప్పారు. మిగతా పాత్రల్లో భావన,ఆషిష్ విద్యార్ది,పరూల్ యాదవ్ నటిస్తున్నారు. బచ్చన్ కి ట్యాగ్ లైన్ ది యాంగ్రీ యంగ్ మ్యాన్. ఈ సినిమాని శశాంక్ డైరక్ట్ చేస్తూండగా ఉదయ్ మెహతా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే జగపతిబాబు తమిళంలో విక్రమ్ చిత్రం తాండవంలో పోలీస్ అధికారిగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్, జగపతిబాబు హీరోలుగా తేజ సినిమా పతాకాన విజయ్ దర్శ కత్వంలో సి. కళ్యాణ్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రం 'శివ తాండవం'. అనుష్క, యామీ జాక్సన్, లక్ష్మీరాయ్, శరణ్య, సుజిత, కోట శ్రీని వాసరావు, నాజర్, సాయాజీ షిండే, ఎం.ఎం. భాస్కర్, ఢిల్లి గణేష్ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రం ఆడియో ఆగస్ట్ రెండవ వారంలో ఆవిష్కరించి, సెప్టెంబర్లో చిత్రాన్ని విడుదల చేస్తామని, ఇది తన 41వ చిత్రమని ఎక్కువ కేంద్రాల్లో విడుదల చేయదలచానని నిర్మాత సి. కళ్యాణ్ అన్నారు.


Click it and Unblock the Notifications











