For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sarkaru Vaari Paata లో మరో సీనియర్ హీరో.. ఆ పాత హీరోను తీసేసి కీలక మార్పులు

  |

  మహేష్ బాబు మొత్తానికి ఈ ఏడాది బాక్సాఫీస్ ను మిస్సవుతున్నాడు. కరోనా లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈపాటికే రాజమౌళి సినిమా కూడా సెట్స్ పైకి వచ్చి ఉండేది. ఇక ప్రస్తుతం సర్కారు వారి పాటను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి.

  ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే బజ్ ఏ రేంజ్ లో ఉందొ ఈజీగా అర్ధమయ్యింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యధికంగా లైక్స్ అందుకున్న ఫస్ట్ లుక్ గా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇక సినిమాకి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ త్వరలోనే రానున్నట్లు టాక్ అయితే వస్తోంది. ఇక ఇటీవల సినిమాలోని ఒక కీలకమైన పాత్ర విషయంలో దర్శకుడు మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

  Key changes in Sarkaru Vaari Paata movie special role

  సినిమాలో కన్నడ సీనియర్ హీరో అర్జున్ సర్జ ఒక పోలీస్ పాత్ర కోసం సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ పాత్ర కోసం మళ్ళీ జగపతిబాబును సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకు మార్చారో తెలియదు గాని జగపతిబాబు అయితేనే బెటర్ అని మహేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది. జగ్గూభాయ్ ప్రస్తుతం బిజీగా ఉన్నప్పటికీ సర్కారు వారి పాట లో మంచి పాత్ర కావడంతో వెంటనే ఒప్పేసుకున్నారట.

  రోల్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సముద్రఖని నెగిటివ్ పాత్రలో నటిస్తున్నాడు. సినిమాలో ప్రతి పాత్ర కూడా సినిమా కథకు లింక్ అయ్యి ఉంటుందట. మహేష్ బాబు కూడా సరికొత్త కామెడీ టైమింగ్ తో ఈ సినిమాలో కనిపిస్తాడట. ఇక 2022 జనవరి 13న ఈ మూవీ గ్రాండ్ గా విడుదల కాబోతోంది. మరికొన్ని రోజుల్లో సినిమా మేకింగ్ వీడియోతో పాటు మరో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయవచ్చని సమాచారం.

  మహేశ్ బాబు కెరీర్ విషయానికి వస్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు భారీగా భవిష్యత్ కార్యచరణతో ముందుకెళ్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత సర్కారు వారీ పాటతో బిజీగా ఉన్న మహేష్.. రాజమౌళి సినిమా కోసం సిద్దం అవుతున్నారు. అయితే ఆ తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో జోడి కట్టడానికి సిద్ధమవుతున్న సూపర్ స్టార్ మహిళా దర్శకురాలి చిత్రంలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారనే విషయం ఇటీవల కాలంలో చర్చనీయాంశమైంది.

  ఇక సర్కారు వారీ పాట చిత్రం విషయానికి వస్తే గీత గోవిందం చిత్రంతో సక్సెస్ అందుకొన్న పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీస్ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందుతున్నది. థమన్ సంగీతం అందిస్తున్నారు.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  The svp movie has come up with sets for the whole which is eagerly awaited by the superstar fans in the Tollywood industry. Sarkaru Vaari Paata Audio Rights bagged by renowned audio label saregama south.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X