వెంకటేష్ చిత్రంలో జగపతిబాబు కీ రోల్

By Srikanya

వెంకటేష్, మెహర్ రమేష్ కాంబినేషన్ లో ఓ స్టైలిష్ ఎంటర్టైనర్ రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జగపతిబాబుని ఓ కీ రోల్ కి ఒప్పించినట్లు సమాచారం. బాలకృష్ణతో 'సింహా' చిత్రాన్ని నిర్మించిన పరుచూరి శివరామప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ మోహన్, కోన వెంకట్ ఈ చిత్రం కథను వండే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జగపతిబాబు ఈ మధ్యన వరసగా ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొంటున్నారు. దాంతో ఆఫర్స్ కూడా కరువయ్యాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో ఆఫర్ రావటంతో వెంటనే ఓకే చేసినట్లు గా చెప్పుకుంటున్నారు. అలాగే రిచా గంపోపాధ్యాయ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో జనవరి నుంచి సెట్స్ కు వెళ్లనుంది.

ఇక ప్రస్తుతం వెంకటేష్, మహేష్ కాంబినేషన్ లో రూపొందే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటిస్తున్నారు. అడ్డాల శ్రీకాంత్ దర్సకత్వంలో దిల్ రాజు నిర్మించే ఈ చిత్రం ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకుంది. అలాగే వెంకటేష్ తాజా చిత్రం బాడీగార్డ్ ఈ సంక్రాంతికి విడుదల అవుతోంది. డాన్ శీను దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మలయాళంలో విజయవంతమైన బాడీగార్డ్ కు రీమేక్. త్రిష, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం కామిడీ, సెంటిమెంట్ కలసిన ఎంటర్టైనర్. మెహర్ రమేష్ సైతం శక్తి చిత్రం ఫ్లాప్ తర్వాత చేస్తున్న ఈ చిత్రాన్ని చాలా జాగ్రత్తగా ఎలాగైనా హిట్ కొట్టాలని భావించి రూపొందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X