SSMB28: మహేశ్ బాబు మూవీలో తెలుగు హీరో.. అతి క్రూరమైన పాత్రలో.. టాలీవుడ్‌లోనే ఫస్ట్ టైమ్ ఇలా!
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా.. చిన్న వయసులోనే ప్రేక్షకులను ఫిదా చేసే నటనతో మంచి పేరు తెచ్చుకున్నాడు మహేశ్ బాబు. ఇక, సోలో హీరోగా మారిన తర్వాత తన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌కు తోడు హ్యాండ్సమ్ లుక్స్‌తో అదరగొట్టేసి స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మహేశ్ బాబు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో మీరే చూడండి!
త్రివిక్రమ్ - మహేశ్ మూడోది
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు మూడో సినిమాను చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది కీలక పాత్రలు చేస్తున్నారు.

ఆటంకాలతో షూట్ బ్రేక్‌లు
రెండు క్రేజీ మూవీల తర్వాత మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. ఆ వెంటనే మొదటి షెడ్యూల్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేశారు. తర్వాత కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా దాని తర్వాత నుంచి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా చేసేలా ప్లాన్లు చేసుకుంటున్నారు.

సంక్రాంతికి.. అప్‌డేట్‌తోనే
వాస్తవానికి ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ముందుగానే ప్రకటించింది. కానీ, షూటింగ్ సజావుగా సాగని కారణంగా దీన్ని వాయిదా వేస్తున్నారని వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా తీసుకు వస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ ఇటీవలే విడుదల చేసింది.

టైటిల్ విషయం నో క్లారిటీ
క్రేజీ కాంబోలో రూపొందుతోన్న ఈ మూవీ టైటిల్ విషయంలో క్లారిటీ రావట్లేదు. ఇప్పటికే ఈ సినిమా కోసం 'అర్జునుడు', 'అతడే పార్థు', 'అమ్మ కోసం', 'అయోధ్యలో అర్జునుడు', 'అమ్మకోసం', 'గుంటూరు కారం', 'అమరావతికి అటు ఇటు' వంటి టైటిళ్లను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, చిత్ర యూనిట్ మాత్రం స్పందించడంలేదు.

విలన్ గురించి లీక్ చేశారు
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించే ఈ సినిమా విలన్ పాత్రను ఎవరు చేస్తారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే సంజయ్ దత్, పృథ్వీరాజ్ సుకుమారన్, సముద్రఖని పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే, ఈ చిత్రంలో తెలుగు సీనియర్ హీరో జగపతి బాబు మెయిన్ విలన్‌గా నటిస్తున్నారని నిర్మాత నాగ వంశీ రివీల్ చేశారు.

అతి క్రూరమైన పాత్రలో
మహేశ్ బాబు సినిమాలో జగపతి బాబు పాత్ర ఎంతో క్రూరంగా ఉంటుందని తాజాగా ఆయనే స్వయంగా వెల్లడించారు. 'మహేశ్ మూవీలో నా రోల్ ఎంతో వైలెంట్‌గా ఉంటుంది. అరవింద సమేత కంటే క్రూరంగా నన్ను ఇందులో చూపించబోతున్నారు. ఇది జనాలకు మంచిగానో, చెడ్డగానో కచ్చితంగా నచ్చుతుంది. ఈ పాత్ర చేయడం నాకు సంతృప్తిని ఇచ్చింది' అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











