‘లెజెండ్’ విలన్‌గా జగపతి బాబు ఫస్ట్ లుక్ (ఫోటోలు)
హైదరాబాద్: ఇప్పటి వరకు హీరో పాత్రలు చేస్తూ వచ్చిన జగపతి బాబు తొలి సారిగా పూర్థి స్థాయి విలన్ పాత్ర చేస్తున్న చిత్రం 'లెజెండ్'. తాజాగా జగపతి బాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఈచిత్రంలో జగపతి బాబుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోలు విడుదల చేసారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా 'సింహా' ఫేం బోయపాటి శ్రీను తెరకెక్కుతున్న నూతన చిత్రం 'లెజెండ్'. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
స్లైడ్ షోలో జగపతి బాబు ఫస్ట్ లుక్ ఫోటోలు, సినిమాకు సంబంధించిన వివరాలు....

జగపతి బాబు విలన్
ఓ టీవీ ఇంటర్వ్యూలో జగపతి బాబు తన పాత్ర గురించి చెబుతూ ‘ లెజెండ్ లో ఫుల్ లెంగ్త్ విలన్ పాత్ర. అలా అని ఆ పాత్ర మోటుగా రేపులు, స్మగ్లింగ్, ల్యాండ్ మాఫియాలా కాకుండా స్టైలిష్ గా ఉంటుంది. బాగా పంతం ఉన్న వ్యక్తి. నువ్వొక దెబ్బ కొడితే నేనొక దెబ్బ కొడతా అనే టైపు పాత్ర. చెప్పాలంటే ‘డీ అంటే డీ' అనే పాత్రని' తెలియజేశాడు.

పునర్జన్మలా ఫీలవుతున్న జగపతి బాబు
నందమూరి బాలకృష్ణ సినిమాలో విలన్‌గా కనిపించడంపై జగపతిబాబు స్పందిస్తూ...ఈ సందర్భాన్ని తన పునర్జన్మలా ఫీలవుతున్నాను అన్నారు. గతంలో నేను కొన్ని చెడ్డ సినిమాలు చేసాను. ఆ సినిమాలు ఎప్పుడు విడుదలయ్యి వేల్లిపోతున్నాయో కూడా నాకు తెలియదు. అందుకే నా సినిమాల విషయంలో కేర్ తీసుకోవాలనుకున్నాను. ఈ మార్పు నాక్కు పునర్జన్మ లాంటిదని'అన్నాడు.

బాలయ్యతో ఫ్రెండ్షిప్
నాకు బాలయ్య బాబు అంటే ఇష్టం, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. అలాగే ఒక మంచి బ్యానర్ లో, ఓ మంచి దర్శకుడితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కథలో ఎంతో విషయం ఉంది. ఈ సినిమాలో నేను మూడు జెనరేషన్స్ కి సంబంధించి మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనపడతాను. అందుకోసం నా బాడీ లాంగ్వేజ్ లో చాలా మార్పు చూపించాల్సి వస్తుందని' అన్నాడు.

సింహా కాంబినేషన్
'సింహ' కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. జగపతిబాబు ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. రాధికా ఆప్టే, సొనాల్ చౌహాన్ హీరోయిన్స్. దేవీశ్రీప్రసాద్ తొలిసారి బాలకృష్ణ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది.


Click it and Unblock the Notifications











