చిరంజీవి..కాపీ కథతోనే
జగపతిబాబు హీరోగా మా నాన్న చిరంజీవి అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం హాలీవుడ్ హీరో విల్ స్మిత్ నటించిన ఓ పాపులర్ చిత్రాన్ని కాపీ చేస్తూ తయారవుతోందని సమాచారం. ఫరసూట్ ఆఫ్ హ్యాపీనెస్ అనే టైటిల్ ఉన్న ఆ చిత్రం అక్కడ మంచి విజయాన్నే సాధించింది. అందులోనూ విల్ స్మిత్ సొంత కుమారుడు జేడెన్ స్మిత్ ఆ సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఇక్కడ ఆ కుర్రాడు పాత్రను మాస్టర్ అతులిత్ చేస్తున్నాడు. ఉద్యోగం పోగొట్టుకుని, పెళ్ళాం నిరాదరణకు గురైన ఓ తండ్రి తన కుమారుడును ఏ విధంగా కష్టాలు పడి సాకాడు అన్నది ఈ చిత్ర కథ. దీనిని తమ్ముడు దర్శకుడు అరుణ్ ప్రసాద్ తనదైన రీతిలో నేటివిటీ అద్ది అందిస్తున్నారు. కన్నీరు పెట్టించే కథనంతో తయారవుతున్న ఈ సినిమాకు ఓ కామిడీ చిత్రం అన్నట్లు పబ్లిసిటీ చేస్తున్నారు. ఇక టైటిల్ జస్టిఫికేషన్ ప్రకారం చిరంజీవి వంటి మెగా హీరో మా నాన్న అని కొడుకు గర్వపడటమేనంటున్నారు. ఇక అరుణ్ ప్రసాద్ గతంలో పవన్ తో రూపొందించిన తమ్ముడు చిత్రం కూడా హిందీ చిత్రం జో జీత్ హై వహీ సికిందర్ అనే చిత్రం ప్రేరణ.


Click it and Unblock the Notifications











