జగపతి బాబు కెరీర్ లో తొలిసారిగా...
జగపతి బాబు కెరీర్‌లోనే తొలిసారిగా జనవరి ఒకటిన విడుదలవుతున్న సినిమా ఇదే. ప్రపంచవ్యాప్తంగా 90 ప్రింట్లు, 150 థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అంటూ 'మా నాన్న చిరంజీవి' గురించి విశాఖ టాకీస్ అధినేత నట్టి కుమార్ చెప్పుకొచ్చారు. ఆయన ఈ చిత్రం ప్రపంచవ్యాప్త ప్రదర్శన హక్కుల్ని పొందారు. జయశ్రీ సమర్పణలో లాఫింగ్ లార్డ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందించారు. అంతకు ముందు అరుణ్ ప్రసాద్..పవన్ కళ్యాణ్ హీరోగా తమ్ముడు చిత్రాన్ని డైరక్ట్ చేసారు. ఈ చిత్రం జనవరి 1న విడుదలవుతుంది. ఈసందర్బంగా నట్టికుమార్ మీడియాతో మాట్లాడారు.
తల్లి దూరమైన కొడుకుని ఓ తండ్రి ఎలా పెంచాడు, వాళ్లిద్దరి మధ్యా ఎంతటి గాఢానుబంధం ఏర్పడింది, చివరికి ఆ తల్లి వాళ్లకి దగ్గరయ్యిందా, లేదా? అనే కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని అరుణ్‌ప్రసాద్ రూపొందించారు. తండ్రిని కొడుకు ఎలా ఒక రోల్‌మోడల్‌గా భావిస్తాడో ఈ సినిమాలో చూడొచ్చు. ఆ కొడుక్కి తండ్రి 'ఒక పేద్ద హీరో'. ఒక హాలీవుడ్ హిట్ ఫిల్మ్ ప్రేరణతో ఈ చిత్రాన్ని ఆయన తీశారు అంటూ ఈ చిత్రం కథ గురించి చెప్పుకొచ్చారు. ఇక ఆయన తన భవిష్యత్ కార్యాచరణ గురించి చెపుతూ...అగ్ర హీరోలు, అగ్ర దర్శకులతో నేను తీస్తున్న సినిమాలు 2010లో ఐదు విడుదల కాబోతున్నాయి. నట్టికుమార్ గతంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన అడవి చిత్రాన్ని రిలీజ్ చేసారు.


Click it and Unblock the Notifications











