Rudrangi Twitter Review: దొరల కాలాన్ని చూపించిన రుద్రంగి.. సినిమా ఎలా ఉందంటే?
సీనియర్ హీరో జగపతి బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం అక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా హీరోగా తన సత్తా చాటుతూ వస్తున్నారు. 90వ దశకంలో ఫ్యామిలీ హీరోగా అనేక మంది మహిళా అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవల కాలంలో పవర్ ఫుల్ విలన్ పాత్రలు చేసి కూడా ఎంతగానో మెప్పించారు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో తాజాగా నటించిన చిత్రం రుద్రంగి (Rudrangi). ఈ సినిమా జూలై 7న అంటే ఇవాళ ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు పలు చోట్ల రుద్రంగి ప్రీమియర్, బెన్ ఫిట్ షోలు పడ్డాయి. మరి అవి చూసిన నెటిజన్లు సినిమా గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం (Rudrangi Twitter Review).
హీరోయిన్ రీ ఎంట్రీ: జగపతి బాబు ప్రధాన పాత్ర పోషించిన లేటెస్ట్ మూవీ రుద్రంగి. పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు అజయ్ సామ్రట్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రసమయి ఫిల్మ్స్ బ్యానర్ పై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మాతగా వ్యవహరించారు. చాలా కాలం తర్వాత బ్యూటిఫుల్ మమతా మోహన్ దాస్ ఈ మూవీతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అలాగే విమలా రామన్ కూడా నటించింది.

దివి-జాజిమొగులాలి: రుద్రంగి సినిమాలో మమతా మోహన్ దాస్, విమలా రామన్ తో పాటు ఆశిష్ గాంధీ కీలక పాత్ర పోషించారు. ఇటీవల రుద్రంగి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నందమూరి నటసింహం బాలకృష్ణ స్పెషల్ గెస్టుగా హాజరు కావడంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. అంతకుముందు బిగ్ బాస్ దివి చేసిన ఐటమ్ సాంగ్ జాజిమొగులాలి పాటతో కూడా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.
తిరుగుబాటు: తాజాగా రుద్రంగి మూవీ ప్రీమియర్స్ పడ్డాయి. అవి చూసిన ఆడియెన్స్ ఎలా రియాక్ట్ అయ్యారో ట్విటర్ రివ్యూలో చూద్దాం. "రుద్రంగి సినిమా తెలంగాణ ప్రాంతంలో నిజాం కాలలో భూస్వామ్య వ్వవస్థపై తెరకెక్కించిన ఫిక్షనల్ స్టోరి. స్వాతంత్య్రానికి ముందు జాగీర్దార్, భూస్వాములు చూపించిన కుల వివక్షత చూపించారు. వివిధ పాత్రలతో తిరుగుబాటును చక్కగా చూపించారు. సెకండాఫ్ లో ఊహజనిత సన్నివేశాలు ఎక్కువయ్యాయి" అని ఒకరు చెప్పుకొచ్చారు.

మహిళల గురించి: "మహిళలకు బాగా రెస్పెక్ట్ ఇచ్చి చేశారు రుద్రంగి మూవీ. ఇటీవల కాలంలో ఇలాంటి సినిమా నేను చూడలేదు. ఎస్పెషల్ గా వుమెన్ కు బాగా రెస్పెక్ట్ ఇచ్చారు. ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది. అమ్మాయిలుక చూపించిన ఎలివేషన్ బాగుంది. సినిమా చాలా బాగుంది. ఎప్పటిలానే జగపతి బాబు యాక్టింగ్ సూపర్బ్. ఆయన మ్యానరిజం చాలా తెప్పిస్తుంది. చాలా బాగా చేశారు" అని ఒక మహిళ ప్రేక్షకురాలు పేర్కొన్నారు.

దొరల కాలం: "దొరల కాలాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. పూర్వ కాలంలో ఎలా జరిగేది ఏంటీ అనేది చాలా బాగుంది. మ్యూజిక్, గ్రాఫిక్స్ అన్నీ బాగున్నాయి. డైలాగ్స్ ఇంకా చాలా బాగున్నాయి. జగపతి బాబు గారి యాక్టింగ్ కు వంక పెట్టడానికి ఏం లేదు. విమలా రామన్ అంతా చాలా బాగా చేశారు. ఎమోషనల్ గా సీన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి" అని మరొకరు తెలిపారు.


Click it and Unblock the Notifications











