మహేష్ బాబు తండ్రి పాత్రలో జగపతి బాబు!
హైదరాబాద్: 'లెజెండ్' చిత్రంతో విలన్ అవతారం ఎత్తిన జగపతి బాబు మరో సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న చిత్రంలో మహేష్ బాబు తండ్రి పాత్రలో నటించడానికి జగపతి బాబు ఓకే చెప్పారు. ఈ విషయాన్ని జగపతి బాబు స్వయంగా తన సోషల్ నెట్వర్కింగు పేజీలో వెల్లడించారు.
'కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో మహేష్ బాబు తండ్రి పాత్ర చేయబోతున్నాను. టాలీవుడ్ హార్ట్ రోడ్ మహేష్ బాబుతో కలిసి నటించే అవకాశం రావడం ఎంతో ఎక్సైటెడ్‌గా ఉంది' అని జగపతి బాబు తన సోషల్ నెట్వర్కింగ్ పేజీలో వెల్లడించారు. జగపతి బాబును తండ్రి పాత్రకు ఎంచుకున్నారంటే ఆ పాత్ర పవర్ ఫుల్‌గా ఉంటుందని భావిస్తున్నారు.

మైత్రి మూవీస్ పతాకంపై ఎర్నేని నవీన్, ఎలమంచిలి రవి శంకర్, సివిఎం సంయుర్తంగా ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ముహూర్తం ఖరారైంది. జులై నెలలో ఈచిత్రం ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రస్తుతం కొరటాల శివ పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్నారు.
త్వరలో చిత్రానికి సంబంధించిన హీరోయిన్, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నారు. ఈ చిత్రాన్ని యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కించేందుకు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఎంపికైనట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











