నిజ జీవితంలో ప్రవరాఖ్యుణ్ణి కాను..జగపతిబాబు

By Srikanya

అమ్మాయిలకు దూరంగా ఉండేవారిని ప్రవరాఖ్యుడు అని సంభోదించటం కామన్ గా జరుగుతూంటుంది. అయితే తానూ నిజజీవితంలో ప్రవరాఖ్యుడుని కానని జగపతిబాబు చెప్తున్నాడు. ఆయన నటించిన ప్రవరాఖ్యుడు ఆడియో పంక్షన్ లో మాట్లాడుతూ.."నేను నిజ జీవితంలో ప్రవరాఖ్యుణ్ణి కాను. ఈ సినిమా కోసం ప్రతిభావంతులైన టెక్నీషియన్స్‌తో పనిచేశా. ఇది భారీ బడ్జెట్‌ ఫిల్మ్‌ కావడం వల్ల నాతో వద్దని మొదట్లో డైరెక్టర్‌ మదన్‌కి చెప్పా. కానీ తను పట్టుబట్టి నాతో ఈ సినిమా చేయించాడు. ఈ సినిమాతో ఈ నిర్మాతలు స్టార్‌ ప్రొడ్యూసర్స్‌ అవుతారు. కీరవాణి చాలా చక్కని సంగీతం అందించారు" అని చెప్పారు.

పెళ్లయింది కొత్తలో చిత్రతో దర్శకుడుగా పరిచయమైన మదన్‌ ఈ చిత్రాన్ని అదే కాంబినేషన్ లో చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ "మను చరిత్రలోని ప్రవరాఖ్యుడి కథకీ, ఈ సినిమా కథకీ సంబంధం లేదు. ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో ప్రవరాఖ్యుడు అంటే జెంటిల్‌మన్‌. ప్రేమ మూలాల కోసం ఈ ప్రవరాఖ్యుడు చేసిన అన్వేషణ ఏంటనేది ఈ సినిమా. ప్రతి సినిమాకీ కీరవాణిలో ఒక కొత్త సంగీత దర్శకుడు కనిపిస్తున్నాడు" అని తెలిపారు.

సంగీత దర్శకుడు కీరవాణి.."ప్రేమ కథలనేది ఎప్పుడూ ఫెయిల్‌ కావు. ఈ సినిమాలో ప్రేమని ఒక కొత్త కోణంలో మదన్‌ చూపిస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది" అన్నారు.ఇక ఈ కార్యక్రమంలో ప్రియమణి, వరుణ్‌సందేశ్‌, నటులు చలపతిరావు, అలీ, సి.వి.ఎల్‌. నరసింహారావు, గేయ రచయిత చైతన్యప్రసాద్‌, గాయనీమణులు సునీత, గీతామాధురి, ఆదిత్య దయానంద్‌, డాన్స్‌మాస్టర్‌ విద్య తదితరులు పాల్గొని ప్రవరాఖ్యుడు హిట్ కావాలని ఆశించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X