జగపతి బాబుతో ప్రియమణికీ ఉన్న సంభందం ఏమిటి

By Srikanya

పెళ్లయిన కొత్తలో చిత్రంతో తొలిసారిగా జంటకట్టిన జగపతిబాబు,ప్రియమణి మరో రెండు చిత్రాలలో కలిసి చేస్తున్నారు. అందులో ఒకటి ప్రవరాఖ్యుడు. ఆ చిత్రం ఈ రోజు(శుక్రవార)రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం కథ గురించి చెపుతూ...శశికుమార్‌ (జగపతి బాబు) అమెరికా స్థిరపడ్డ శాస్త్రవేత్త. బ్యాచులర్. ఓ సందర్భంలో ఇండియా వచ్చేస్తాడు. ఇక్కడ ఓ మహిళా కళాశాలలో లెక్చరర్ గా చేరతాడు. అతనికీ శైలజ (ప్రియమణి)ప్రిన్సిపాల్ గా పనిచేస్తూంటుంది. అతనికీ ఆమెకీ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? శశి విషయంలో ఆమె ఎలా స్పందించింది? అతని నేపథ్యం ఏమిటన్నది కథ,కథనం అంటున్నారు. అంతేగాక "ఇంటిల్లిపాదీ కలిసి చూడదగ్గ చిత్రమిది. జగపతిబాబు, ప్రియమణి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణ. కీరవాణి సంగీతం, చైతన్యప్రసాద్‌ సాహిత్యం కథకు బలాన్నిచ్చాయి" అన్నారు. జగపతి బాబు - ప్రియమణి - మదన్‌... ఈ ముగ్గురి కలయికలో వచ్చిన గత చిత్రం 'పెళ్త్లెన కొత్తలో' మంచి హిట్ అవటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. టాలీ టూ హాలీ ఫిలిమ్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో మిగతా పాత్రల్లో హంసానందిని, సునీల్‌, బ్రహ్మానందం, చలపతిరావు, ధర్మవరపు, పూజ, అనితానాథ్‌ తదితరులు కనిపిస్తారు. అలాగే ఈ చిత్రానికి సంగీతాన్ని ఎమ్‌.ఎమ్‌.కీరవాణి అందించారు. ఆడియో మంచి టాక్ తెచ్చుకుంది. నిర్మాత: గణేష్‌ ఇందుకూరి కాగా రచన-దర్శకత్వం: మదన్‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X