twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అయ్యోరామా! ఇంతేనా అమ్మాయంటేనే బొమ్మేనా!

    By Sindhu
    |

    'అయ్యోరామా! ఇంతేనా అమ్మాయంటేనే బొమ్మేనా... ఉద్యోగం చేయాలంటే ఉలికేనా..' అంటూ మహిళ ఉద్యోగంచేస్తే ఎటువంటి పరిస్థితులు బయట ఎదుర్కొంటుందో.. తాను ఈ చిత్రంలో పాట ద్వారా ఎంటర్‌ టైన్‌ మెంట్‌ గా చూపించానని పాడి వినిపించారు గీతరచయిత చిన్నిచరణ్‌. ఇది జగపతిబాబు, ప్రియమణి జంటగా నటించిన 'సాధ్యం' చిత్రంలోనిది. కార్తికేయ గోపాలకృష్ణను దర్శకుడిగా, కుమార్‌ బ్రదర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమం రీసెంట్ గా ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. అన్ని పాటలు సందర్భానుసారంగా ఉంటాయనీ, ప్రియమణి నటన హైలైట్‌గా నిలుస్తుందని ఆయన తెలిపారు. "ఇండిస్ట్రీలో అవకాశాలు వెతుకుతున్న సమయంలోనే ప్రియమణి ఫొటో తీసుకుని నా రూమ్మేట్‌ హరనాథ్‌కూడా తిరిగాడు. చూస్తుండగానే జాతీయనటి స్థాయికి ఎదిగింది. ఆమె నటించిన చిత్రం ద్వారా సంగీతదర్శకుడిగా పరిచయం కావడం థ్రిల్‌గా ఉందని" చిన్నిచరణ్‌ మనసును ఆవిష్కరించారు.

    జగపతిబాబు మాట్లాడుతూ, చిన్నిచరణ్‌ సంగీతమేకాకుండా మనిషి కూడా బాగా నచ్చాడు. తన తోటి కళాకారుల్ని సభకు పరిచయంచేసి వారిలో మనోధైర్యాన్ని పెంచి అభినందనీయుడునిపించుకొన్నాడు. కొన్ని సినిమాలు చేస్తుంటే ఎందుకు చేస్తున్నామో అర్థంకాదు. కానీ ఈ చిత్ర నిర్మాతల్ని చూస్తుంటే ఇటువంటి నిర్మాతలతో మళ్ళీ సినిమా చేయాలనిపించింది. జగపతి బాబు, ప్రియమణి, కీర్తీ చౌలా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం సీరియస్‌గా సాగుతూ చక్కటి ఎంటర్‌టైనర్‌ ఇందులో ఉందని అన్నారు.

    జగపతిబాబు, ప్రియమణి కాంబినేషన్‌లో వచ్చిన 'పెళ్లైనకొత్తలో' చిత్రం మాదిరిగా ఈ చిత్రం కూడా ఘన విజయం సాధించాలని బెల్లంకొండ సురేష్‌ ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కథనాయిక ప్రియమణి‌, లగడపాటి శ్రీధర్‌, తమ్మారెడ్డి భరద్వాజ, చిత్ర దర్శకుడు తదితరులు చిత్ర విజయాన్ని కాంక్షించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X