పదివేల మంది పేదలకు సాయం.. పెద్ద మనసు చాటుకున్న జగపతి బాబు
కరోనా వైరస్ వచ్చి ఎంతో మంది పొట్టను కొట్టింది. ప్రపంచాన్ని గుప్పిట పట్టి పీడిస్తున్న కరోనా లక్షల మందిని బలి తీసుకుంటుంటే.. ఆకలి కేకల్లో ఇంకా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దేశంలోని ఎంతో మంది పెద్ద మనసు కలవారు పేదలకు అండగా నిలుస్తున్నారు. తమకు చేతనైన సాయాన్ని చేస్తున్నారు. నిత్యావసర సరకులను అందించడమో లేదా ఆహార పంపిణీ చేయడమో ఇలా ఏదో ఒకటి చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో సాయం చేసేందుకు ముందు నిలబడిన సోనూ సూద్, ప్రణీత లాంటి సెలెబ్రిటీస్ రియల్ హీరోస్‌గా మారిపోయారు. లాక్ డౌన్‌లో పేదల కడుపు నింపడంలో హీరోయిన్ ప్రణీత అందరికంటే ముందుంది. మొదటి నుంచి తనక చేతనైనంతలో అందరికీ ఆహారాన్ని అందిస్తోంది. మరోవైపు సోనూ సూద్ వలస కార్మికులను వారి ఇంటికి చేర్చడంలో ఎవ్వరూ చేయలేని సాయాన్ని చేస్తున్నాడు. తాజాగా జగపతి బాబు.. పది వేల మంది పేదలకు నిత్యావసర సరుకులు అందించాడు.

జగపతిబాబు చాలా మంది సినీ కార్మికులకు తానే స్వయంగా బియ్యం, పప్పులు, వంట నూనె తదితర నిత్యావసరాలను అందించాడు. అలాగే కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ని పకడ్భందీగా నిర్వహిస్తున్న పోలీసులకి గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో సీపీ వి.సి.సజ్జనార్‌ను కలిసి ఎన్-95 మాస్కులు, శానిటైజర్లను అందించాడు. ఇబ్బందులలో ఉన్న పదివేల మంది పేదలకి నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లను అందజేశారని తెలిసింది. ఇదే విషయాన్ని జగపతి బాబుని అడగ్గా 'సహాయం చేసిన మాట వాస్తవమే కాని చేసిన ప్రతి సహాయం అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదా... ఆపదలో ఉన్న వారికి సహాయం చేశాన'ని ఎంతో సింపుల్‌గా, హంబుల్‌గా సమాధానం చెప్పాడట.


Click it and Unblock the Notifications











