డిజైనర్ స్టూడియోలో జగపతిబాబు (ఫోటోలు)
హైదరాబాద్: తెలుగు నటుడు జగపతిబాబు బంజారా హిల్స్‌లో కొత్తగా ఏర్పాటైన రామ్జ్ డిజైనర్ స్టూడియోను ప్రారంభించారు. ఈ డిజైనర్ స్టూడియోలో ఎక్స్‌క్లూసివ్ పార్టీ వేర్, ఖరీదైన డిజైనర్ దస్తువులు లభిస్తాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగపతి బాబు రిబ్బన్ కట్ చేసి స్టూడియోను ప్రారంభించారు. దర్శకుడు మధుర శ్రీధర్, కమెడియన్ వేణు తదితరులు కూడా హాజరయ్యారు.
జగపతి బాబు గురించి వివరాల్లోకి వెళితే....తెలుగులో ప్రముఖ నటుడిగా పేరు తెచ్చుకున్న జగపతి బాబు పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఇద్దరు పెళ్లాల హీరోగా ఒకప్పుడు ఆయన నటించిన చిత్రాలకు ఫ్యామిలీ ప్రేక్షకుల ఆదరణ అద్భుతంగా ఉండేది. ప్రస్తుతం సినిమాల ట్రెండు మారిన నేపథ్యంలో ఆయన హీరో పాత్రలతో పాటు విలన్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రాతలు చేయడానికి సిద్ధమయ్యారు.
ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న 'లెజెండ్' చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్ర పోషిస్తున్నారు. అదే విధంగా సందీష్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న 'రారా కృష్ణయ్య' చిత్రంలో హీరో అన్నయ్య పాత్ర చేయడానికి రెడీ అయ్యారు జగపతి.

ప్రారంభోత్సవం
రామ్జ్ డిజైనర్ స్టూడియోను రిబ్బన్ కట్ చేసి ప్రారంభిస్తున్న జగపతి బాబు.

డిజైన్స్
రామ్జ్ డిజైనర్ స్టూడియోలోని వివిధ రకాల డిజైనర్ దుస్తువులను పరిశీలిస్తున్న జగపతి బాబు.

ఇది నచ్చింది
ఈ డిజైనర్ స్టూడియోలో నాకు ఇది బాగా నచ్చింది అంటూ ఫోటోలకు ఫోజులు ఇస్తున్న జగపతి బాబు.

జగపతి బాబు
జగపతి బాబు రాకతో రామ్జ్ డిజైనర్ స్టూడియో సందడిగా మారింది.


Click it and Unblock the Notifications











