మహేష్ చేసుంటే పెద్ద హిట్ అయ్యేది: జగపతి బాబు
అలాగే నా వాయిస్ డబ్బింగ్‌కి పనికిరాదని అందరూ అంటూ ఉంటే, అది బాగుందని చెప్పి డబ్బింగ్ చెప్పించిన రాంగోపాల్‌వర్మ తీసిన 'గాయం'లోని దుర్గ పాత్ర నా కెరీర్‌లో ఓ మైలురాయి. అయితే ఇప్పుడు ఆ సినిమా చూస్తుంటే నా నటన నాకు నచ్చలేదు. ఆ సినిమా గొప్పదనమంతా వర్మదే అని చెప్పారు. నా కెరీర్‌లో మరో మైల్‌స్టోన్ 'అంతఃపురం'. అందులో చేసినంత బాగా మళ్లీ నేను చేయలేనేమో అన్నారు.
ఇక ఓ విప్లవాత్మక ఆలోచనతో ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్ట్ చేసిన సినిమా 'శుభలగ్నం'. అలాగే 'మావిచిగురు'. నాకు పేరు తెచ్చిన ఇంకో సినిమా 'హనుమాన్ జంక్షన్'. అమాయకత్వం, మూర్ఖత్వం కలగలసిన ఆ పాత్ర నాకు బాగా సంతృప్తినిచ్చింది. 'శివరామరాజు', 'కథానాయకుడు' సినిమాల్లో చేసిన పాత్రలన్నా ఇష్టమే. నా రెండో సినిమా 'అడవిలో అభిమన్యుడు' థియేటర్లలో ఫ్లాపైనా, టీవీలో పెద్ద హిట్. 'జగన్నాటకం'లో మంచి కేరక్టర్. బాగా చేయగలిగాను. నా మొదటి వంద రోజుల సినిమా 'పెద్దరికం' అని వివరించారు.
తను హీరోగా రాబోతున్న సినిమాలు గురించి మాట్లాడుతూ... త్వరలో 'ఏప్రిల్ ఫూల్' రిలీజ్ కాబోతోంది. ఇందులో నాది ముక్కుసూటిగా వ్యవహరించే ఓ మంచి పాత్ర. అలాగే కన్నడ చిత్రం 'బచ్చన్'లో సుదీప్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నా. ఇందులో నాది ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కేరక్టర్ అన్నారు. జగపతి బాబుకి ధట్స్ తెలుగు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications












