వైఎస్ఆర్ బయోపిక్‌‌లో జగపతి బాబు.... ఎవరి పాత్రలో ?

By Bojja Kumar

Recommended Video

Jagapathi Babu Playing A Role In Ysr Biopic

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'యాత్ర'. వైఎస్ఆర్ కుటుంబంతో పాటు ఆయన రాజకీయ సహచరులు, ఆయన జీవితంలో ముఖ్యమైన వ్యక్తులను ఫోకస్ చేయడంతో పాటు ... ముఖ్యమంత్రి కావడానికి ముందు వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన పాదయాత్రను ఫోకస్ చేస్తూ ఈ మూవీ సాగబోతోంది. వైఎస్ఆర్ పాత్రను మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి పోషిస్తున్న ఈ మూవీకి మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రకు జగపతి బాబును తీసుకోబోతున్నట్లు టాక్.

వైఎస్ రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు?

వైఎస్ రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు?

వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు నటించబోతున్నారని, ఆయన పాత్రకు జగపతి సరిగ్గా సరిపోతారని నిర్ణయానికి వచ్చిన చిత్ర బృందం ఈ మేరకు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

రాజరెడ్డిపై కీలక సీన్లు

రాజరెడ్డిపై కీలక సీన్లు

రాయలసీమ ఫ్యాక్షన్ గొడవల్లో 1998లో జరిగిన బాంబు దాడిలో వైఎస్ రాజారెడ్డి మరణించారు. ఈ సినిమాలో రాజారెడ్డి గురించి సామాన్య ప్రజలకు తెలియని చాలా విషయాలు చూపించబోతున్నారట.

అనసూయ కూడా..

అనసూయ కూడా..

‘యాత్ర'లో కర్నూలు జిల్లాకు చెందిన పవర్ ఫుల్ మహిళా నేత పాత్ర కోసం అనసూయను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఫుల్ లెంగ్త్ రోల్ కాదని, అతిథి పాత్ర మాత్రమే అని టాక్. అయితే ఈ విషయమై దర్శక నిర్మాతల నుండి క్లారిటీ రావాల్సి ఉంది. ఆవిడ పోషించే పాత్ర మరేదో కాదు... శోభా నాగిరెడ్డి పాత్ర అని ప్రచారం జరుగుతోంది.

ఇతర ముఖ్యమైన పాత్రల్లో

ఇతర ముఖ్యమైన పాత్రల్లో

మ‌హి.వి.రాఘ‌వ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ పాత్రలో 'బాహుబలి' ఫేం అశ్రితా వేముగంటి. వైఎస్ వ్యక్తిగత సహాయకుడు సూరీడు పాత్రలో పోసాని కృష్ణమురళి, వైఎస్ ప్రాణ స్నేహితుడు కేవీపీ రామచంద్రరావు పాత్రలో రావు రమేష్‌, వైఎస్ఆర్ హయాంలో హోం మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని ఎంపికైనట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X