బ్యాంకాక్ లో జగపతి బాబు బర్త్ డే పార్టీ
ఈ రోజు(ఫిబ్రవరి 12) జగపతిబాబు తన పుట్టిన రోజు వేడుకను బ్యాంకాక్ లో జరుపుకోబోతున్నారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ 'ప్రతి పుట్టినరోజును చాలా నిరాడంబరంగా జరుపుకుంటాను. అలాగే ఈ పుట్టినరోజు కూడా. కాకపోతే ఈసారి బ్యాంకాక్‌లో 'గాయం-2' షూటింగ్‌లో వున్నాను. ఈ పుట్టినరోజు అక్కడే యూనిట్ సభ్యుల మధ్య జరుపుకుంటున్నాను. 'గాయం-2' తర్వాత 'సాధ్యం' చిత్ర నిర్మాతలైన కుమార్ బ్రదర్స్‌కు మరో చిత్రం చేస్తున్నాను. ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఒక నటుడిగా నా కెరీర్ పట్ల ఇప్పుడున్న పొజిషన్ పట్ల చాలా హ్యాపీగా వున్నాను. నా ఇరవై ఏళ్ల కెరీర్‌లో అన్ని రకాలైన పాత్రలు పోషించే అవకాశం వచ్చింది. భవిష్యత్‌లో కూడా మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేస్తాను' అంటూ చెప్పుకొచ్చారు జగపతిబాబు.
More from Filmibeat
జగపతిబాబు గాయం 2 పుట్టిన రోజు బ్యాంకాక్ పిబ్రవరి 12 సాధ్యం ప్రియమణి అధినేత ప్రవీణ్ ప్రియమణి jagapathi babu gaayam 2 saadyam bangcock feb 12 pravarakyudu adinetha


Click it and Unblock the Notifications











