twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జగపతి బాబు తెలంగాణా వాదిగా దర్శనమిచ్చేదెపుడంటే...

    By Srikanya
    |

    ఎన్.శంకర్ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'జై బోలో తెలంగాణ"లో తెలంగాణవాదిగా జగపతిబాబు నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రం డిసెంబర్ చివరి వారంలో విడుదల కానుంది. ఈ విషయాన్ని మీడియావారికి ఎన్.శంకర్ తెలుపుతూ... తెలంగాణ రాష్ట్రంకోసం అమరుడైన తెలంగాణ వాదిగా జగపతిబాబు ఇందులో నటిస్తున్నారు. ఇంతవరకు వరంగల్, కరీంనగర్, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో వేలమంది విద్యార్థులతో ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించాం.

    అలాగే..తెలంగాణ ఉద్యమంతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమాన్నీ మా చిత్రంలో చూపిస్తాం. ఈ ఉద్యమాల్ని నిష్పాక్షికంగా, ఒక జర్నలిస్టిక్ వ్యూతో చూపించబోతున్నాం. కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఇందులో కనిపిస్తాయి. ఈ చిత్రానికి చక్రి సంగీతాన్ని సమకూరుస్తున్నారు అన్నారు. ఇక ఈ చిత్రంలో మిగతా పాత్రల్లో స్మృతి ఇరాని, లక్షయ్య, గౌరీశంకర్, విద్యాసాగర్, డాక్టర్ శ్రావణ్‌కుమార్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: ఉడుగుల వేణు, పాటలు: అందెశ్రీ, సుద్దాల అశోక్‌తేజ, గోరేటి వెంకన్న, సందిని సిద్ధారెడ్డి, సంగీతం: చక్రి, కథ, నిర్మాత, దర్శకత్వం: ఎన్.శంకర్.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X