జగపతి బాబు 'ప్రవరాఖ్యుడు' చిత్రం చివరకు...
జగపతి బాబు, ప్రియమణి కాంబినేషన్లో మదన్ రూపొందించిన ప్రవరాఖ్యుడు చిత్రం చివరకు ఫ్లాఫ్ టాక్ తో సెటిలైంది. మొదటి ఈ చిత్రం యావరేజ్ రేంజి అన్నవాళ్ళే కష్టమని పెదవి విరుస్తున్నారు. చెప్తున్న పాయింట్ లో స్పష్టత లేకపోవటం, కథ రకరకాలుగా మారి చివరకు ఆఫ్రికా అడవులకు వెళ్లి సింహాలను పరిచయం చేయటంతో సీరియల్ చూసిన అనుభూతి పొందామని ప్రేక్షకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అంతేగాక జగపతిబాబు,ప్రియమణి లు కాలేజీకి స్టూడెంట్స్ లా వెళ్లే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మరీ పెద్దదవటం,వారిని స్టూడెంట్స్ లా చూడలేకపోవటం చాలా ఇబ్బంది పెట్టిందని తేలుస్తున్నారు.
అలాగే మదన్, జగపతి బాబు కాంబినేషన్ పెళ్ళయిన కొత్తలో చిత్రంలో ఉన్నంత క్లారిటీ ఈ చిత్రంలో మిస్సవటం, కామిడీ కూడా పేలకపోవటం మైనస్ గా మారిందంటున్నారు. గుండె ఝల్లు మంది తరహాలోనే రచయితగా సీన్స్ రాసేసుకని దర్శకుడిగా వాటిని తెరకెక్కించే క్రమంలో ఎడిట్ చేసుకోలేక దెబ్బతిన్నాడని మదన్ ని అంటున్నారు. ఇక ఆ నలుగురు వంటి సామాజిక ప్రయోజనం ఉన్న చిత్రాన్ని రాసిన మదన్..ఈ ప్రవరాఖ్యుడు మదన్ ఒక్కరేనే అనే సందేహం కలిగే పరిస్ధితి వచ్చిందని తేలుస్తున్నారు. అలాగే ప్రవరాఖ్యుడు కి ప్రియమణి అందాలు కలిసిరాలేదని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











