'అవును సౌందర్యతో ఎఫైర్ ఉండేది'.. జగపతిబాబు షాకింగ్ కామెంట్స్

స్టార్ హీరోయిన్స్ అనే బ్రాండ్ లిస్ట్ లో ఎక్కువగా అందాలు ఆరబోసే గ్లామర్ గర్ల్స్ మాత్రమే ఉంటారనేది అవివేకులు చెప్పే మాట. గ్లామర్ గీత దాటకుండా కూడా కొంత మంది సింపుల్ గా కనిపించి స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పారు. అలాంటి అతికొద్ది మంది ట్రెడిషినల్ హీరోయిన్స్ లో సౌందర్య ఒకరు. ఆమె ఏ సినిమా చేసినా పాత్రకు తగ్గట్టు మారిపోయి ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉండేవారు. మరణానికి ముందు వరకు కూడా మంచి హీరోయిన్ గానే గుర్తింపు తెచ్చుకున్నారు.

90లలో .. మరో సావిత్రిలా..

90లలో .. మరో సావిత్రిలా..

90వ దశకంలో ఎవరు ఊహించని విధంగా సౌందర్య ఒక రేంజ్ లో సినిమాలను ఒకే చేసింది. స్టార్ హీరోల నుంచి మీడియం హీరోలు అని తేడా లేకుండా అన్ని వర్గాల హీరోలతో నటించింది. నిజం చెప్పాలంటే మరో సావిత్రి వచ్చింది అంటూ ప్రశంసలు అందుకుంది. అలీ తో నటించి బాబు మోహన్ తో వానలో స్టెప్పులు వేసింది అంటే ఆమె మనసులో ఎలాంటి హెచ్చు తగ్గులు లేవని అర్థం చేసుకోవచ్చు. అలాంటి సౌందర్య పై కూడా అప్పట్లో కొన్ని రూమర్స్ వచ్చి అందరిని షాక్ కి గురి చేశాయి.

జగపతిబాబు తో ఎఫైర్ అంటూ..

జగపతిబాబు తో ఎఫైర్ అంటూ..

ఫ్యామిలి హీరో జగపతిబాబుతో సౌందర్య ఎక్కువ సినిమాలు చేశారు. రమ్యకృష్ణ, రోజా వంటి వారు గ్లామర్ తో ఎటాక్ చేస్తున్నా ఆమె రేంజ్ తగ్గలేదు. జగపతి బాబుతో కలిసి చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో వారు మంచి హిట్ పెయిర్ అని చెప్పుకునేవారు. ఇకపోతే అప్పట్లో మీడియా హడావుడి పెద్దగా లేకపోయినా పలు వార్త పత్రికల్లో జగపతిబాబుతో సౌందర్యకు ఎఫైర్ ఉందనే కథనాలు వెలుబడ్డాయి.

షాకింగ్ కామెంట్స్ తో క్లారిటీ ఇచ్చిన జగ్గూభాయ్..

షాకింగ్ కామెంట్స్ తో క్లారిటీ ఇచ్చిన జగ్గూభాయ్..

సాధారణంగా రూమర్స్ ఎన్ని వచ్చినా జగపతిబాబు పెద్దగా పట్టించుకోరు. ఏవైనా రూమర్స్ పై మీడియా ప్రశ్నలు వేస్తే అక్కడికక్కడే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌందర్య గురించి ప్రస్తావన రాగా అప్పట్లో వచ్చిన రూమర్స్ గురించి కూడా స్పందించారు. "అవును నిజమే..! సౌందర్యకు నాకు ఎఫైర్ ఉండేది. నా దృష్టిలో ఎఫైర్ అంటే.. మంచి సంబంధం" అని వారి ఫ్రెండ్షిప్ గురించి తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

Recommended Video

Jagapathi Babu Opens Up On The Affair With Soundarya
సౌందర్య బ్రదర్ కారణంగా..

సౌందర్య బ్రదర్ కారణంగా..

ఇక సౌందర్య సోదరుడు కూడా తనతో ఎంతో స్నేహంగా ఉండేవారని జగ్గూభాయ్ తెలిపారు. 'సౌందర్య బ్రదర్ అమర్ నాథ్ నేను ఏదోఒక విధంగా రెగ్యులర్ గా కలుసుకుంటు ఉండేవాళ్ళం. ఆ సమయంలో సౌందర్య ఇంటికి నేను..మా ఇంటికి సౌందర్య వచ్చేవారు. అంతేగాని మరొక విధమైన కారణం కాదు' అని జగపతిబాబు వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X