ఆ హీరోతో తరచు గొడవలు.. ఇండస్ట్రీలో ఒక్క స్నేహితుడు లేడు.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొంత మంది సీనియర్ హీరోలు ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ విభిన్నమైన తరహాలో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఎవరూ ఊహించని విధంగా దర్శనమిస్తున్న అతికొద్ది మంది నటులలో జగపతి బాబు గారు ఒకరు. ప్రస్తుతం ఆయన ఎలాంటి పాత్రలు చేసినా కూడా సినిమాలో హైలెట్ ఉంటున్నాయి. ఆ విధంగా జగ్గూ భాయ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేవలం పాజిటివ్ రోల్స్ మాత్రమే కాకుండా నెగటివ్ రోల్స్ తో కూడా చాలా విభిన్నంగా ఆకట్టుకుంటున్నారు. ఇక 30 ఏళ్ళ సినిమా ఇండస్ట్రీలో జగపతి బాబు కి ఒక మంచి మిత్రుడు లేడు అంటే ఎవరు నమ్మలేరు. కానీ అది నిజమని జగపతి బాబు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. అంతేకాకుండా ఆయనకు తరచుగా ఒక హీరోతో గొడవలు ఉండేవని కూడా చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఒకప్పుడు బాక్సాఫీస్ హిట్స్

ఒకప్పుడు బాక్సాఫీస్ హిట్స్


ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న జగపతి బాబు బాక్సాఫీస్ వద్ద చాలా మంచి విషయాలను అందుకున్నారు. శుభాకాంక్షలు, శుభలగ్నం వంటి సినిమాలో అప్పట్లో భారీ స్థాయిలో వసూళ్లను సాధించాయి. ఇక లవర్ బాయ్ గా ఫ్యామిలీ హీరోగా మహిళా ప్రేక్షకులలో క్రేజ్ అందుకున్న జగపతి బాబు ఆ తరువాత ట్రెండ్ కు తగ్గట్టుగా సినిమాలు చేయలేకపోయారు. దీంతో హీరోగా ఆయన ఒక్కసారిగా డౌన్ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.

నెగిటివ్ రోల్స్ చేసి..

నెగిటివ్ రోల్స్ చేసి..

నిర్మాతగా కూడా పలు సందర్భాల్లో ప్రయోగాలు చేసిన జగపతిబాబు తీవ్రస్థాయిలో నష్టాలను కూడా చూడాల్సి వచ్చింది.. ఒకానొక సమయంలో ఆయన కుటుంబ పరిస్థితులను చూసి లోలోపల తీవ్ర మనోవేదనకు గురి అయ్యే వారట. అయితే ఫైనల్ గా జగపతి బాబు కేవలం హీరోగా మాత్రమే కాకుండా నెగటివ్ రోల్స్ కూడా చేయడంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసి ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్నారు.

 ఆ పాత్రలతో మంచి క్రేజ్..

ఆ పాత్రలతో మంచి క్రేజ్..

లెజెండ్ సినిమాలో జగపతి బాబు చేసిన విలన్ పాత్ర ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన సినిమా సక్సెస్ అవ్వడంలో జగపతి బాబు కూడా కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో కూడా జగపతిబాబు పవర్ఫుల్ సపోర్టింగ్ రోల్స్ చేయడమే కాకుండా భయంకరమైన విలన్ పాత్రలో కూడా నటించాడు.
త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమాలోనీ పాత్రకు కూడా మంచి గుర్తంపు లభించింది.

ఒక్క మిత్రుడు కూడా లేడు

ఒక్క మిత్రుడు కూడా లేడు


ఇక ఎన్నో ఆటుపోట్లను చూసిన జగపతి బాబు గత 30 ఏళ్లుగా ఇండస్ట్రీ లో క్రమశిక్షణతో ఉంటున్నారు. అయితే ఈ సినిమా కెరీర్లో ఒక మంచి మిత్రుడు కూడా తనకు దొరకలేదు అది ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ గా తెలియజేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు మంచి మిత్రుడు గా ఎవరూ లేరని అందరూ కూడా ఏదో పైకి మాట్లాడి ఆ తర్వాత గుడ్ బై చెప్పేసే రకాలు అని, పైసా ఉంటేనే పట్టించుకుంటారని చాలా ఓపెన్ గా తెలియజేశారు.

ఆ ఒక్క హీరోతో గొడవలు

ఆ ఒక్క హీరోతో గొడవలు

అయితే తనకు ఒక హీరో తో మాత్రం మంచి అనుబంధం ఉంది అన్నట్లుగా జగపతి వివరణ ఇచ్చాడు. ఆ హీరో మరెవరో కాదు. ఒకప్పటి యాక్షన్ కింగ్ అర్జున్. అర్జున్ అంటే జగపతి బాబు కు చాలా ఇష్టం. అంతేకాకుండా చాలా సందర్భాల్లో వీరు గొడవలు కూడా పడ్డారట. అయితే ఆ గొడవలు స్నేహం లో ఒక భాగమేనని, కానీ బయట వాళ్లకు మాత్రం సీరియస్ గా పొట్లాడుతున్నట్లు ఉంటుంది అని జగపతిబాబు తెలియజేశాడు. అతనితో మంచి బాండింగ్ వల్లనే కలిసి పలు సినిమాల్లో నటించడం జరిగింది అని కూడా వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X