మెగా సినిమాలో, శ్రీహరికి ప్రత్యామ్నాయం జగపతి బాబు
హైదరాబాద్: టాలీవుడ్ రియల్ స్టార్ శ్రీహరి హఠాన్మరణం ఎంతో మందిని కలిచి వేసింది. శ్రీహరి మరణంతో ఇండస్ట్రీలో తీరని లోటు ఏర్పడింది. ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, పవర్‌ఫుల్ యాక్టింగుతో శ్రీహరి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీహరిని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన పాత్రలకు ఎవరిని తీసుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి.
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా తెరంగ్రేటం చేయబోతున్న సాయి ధరమ్ తేజ నటిస్తున్న 'పిల్లా నువ్వు లేని జీవితం' చిత్రంలో తొలుత శ్రీహరిని ఓ ముఖ్యమైన పాత్రకు అనుకున్నారు. అయితే ఆయన మరణంతో ఈ పాత్రలో జగపతి బాబును తీసుకున్నారు. ఇదే విధంగా శ్రీహరి కోసం క్రియేట్ చేసిన ఇతర సినిమాల పాత్రల్లో కూడా జగపతిబాబును తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు పలువురు ఫిల్మ్ మేకర్స్.
హీరో పాత్రలతో తన కెరీర్ ముందుకు సాగే పరిస్థితి లేని విషయాన్ని సరైన సమయంలో గుర్తించిన జగపతి బాబు విలన్ పాత్రలు చేయడం ద్వారా కెరీర్‌ను పొడగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం తెరకెక్కుతున్న చిత్రంలో విలన్ పాత్ర చేయడానికి కమిట్ అయ్యాడు.
నటుడిగా జగపతి బాబుకు మంచి పేరుంది. పలు సినిమాల్లో ఆయన యాక్షన్ పెర్ఫార్మెన్స్, ఎమోషన్ ప్రేక్షకులను కట్టి పడేసింది. ఈ నేపథ్యంలో జగతిబాబు విలన్‌గా రాణిస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది. అదే సమయంలో శ్రీహరి లాంటి వారు చేసే పాత్రల్లోనూ ఆయన పర్ ఫెక్టుగా ఇమిడి పోతారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


Click it and Unblock the Notifications












