'గాయం 2' గురించి జగపతి బాబు చెప్పేది నమ్మచ్చా?
'గాయం 2'...గాయం సీక్వెల్‌లో నటించమంటూ చాలా కథలు నా దగ్గరకి వచ్చాయి. అవన్నీ కొనసాగింపునకు సరైన కథలు అనిపించక ఒప్పుకోలేదు. కొత్త దర్శకుడు ప్రవీణ్ ఈ కథను మొదట 'శివ'కి సీక్వెల్‌గా తయారు చేసుకున్నారు. గాయం సీక్వెల్‌గా కూడా బాగా సరిపోతుందని అనిపించింది. తర్వాత ప్రముఖ దర్శక నిర్మాతల సహాయంతో కొన్ని మార్పులు చేయడంతో 'గాయం'కి నూరు శాతం సరిపోయే కథ తయారైంది. పక్కా స్క్రిప్టుతో సినిమాను తెరకెక్కించాం. అందుకే సినిమా అంత బాగా వచ్చింది అంటున్నారు జగపతి బాబు. అయితే గాయం సీక్వెల్ చిత్రం హిస్టరీ ఆప్ వయిలెన్స్ సినిమాకు ప్రీమేక్ అని వినపడుతోంది. హిస్టరీ ఆఫ్ వయిలెన్స్ ని తీసుకుని గాయం లోని క్యారెక్టర్స్ కలిపి ఈ కథ తయారు చేసాడని చెప్పుకుంటున్నారు. ఇటు చూస్తే జగపతిబాబు..శివ సీక్వెల్ తెస్తే గాయం సీక్వెల్ గా మార్చామని చెప్తున్నారు. ఇంతకీ వీటిలో ఏది నిజం అనేది తేలాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే. ఇక సెప్టెంబరు 3న 'గాయం 2' విడుదలవుతోంది. అలాగే అసలు 'గాయం 2' చిత్రానికి జగపతి బాబే నిజమైన నిర్మాత అని, వేరే వాళ్ళ పేరు పెట్టారని మరో వార్త కూడా వినపడుతోంది.


Click it and Unblock the Notifications











