జె.డి ది క్యారెక్టర్ లేని బిహేవియర్

By Staff

Jagapathi Babu
ఈ విషయాన్ని జగపతిబాబు 'హోమం' ప్రెస్ మీట్ లో మీడియాతో చెప్పారు. నటుడు నుండి దర్శకుడుగా మారిన జె.డి దర్శకత్వంలో వస్తున్న హోమం సినిమాలో హీరోగా చేసిన ఆయన ఆ ముచ్చట్లను పంచుకుంటూ ఈ కామెంట్ చేసారు. ఆయన మాటల్లోనే 'హోమం'రామ్‌గోపాల్‌ వర్మ వైపు నుంచి వచ్చిన ఆఫర్‌ కావడం వల్ల ఆసక్తి చూపించా.

చక్రి (జె.డి. చక్రవర్తి) కథ చెబుతాడని తెలిసినప్పుడు అతని కథ వినడానికి ఓకే అన్నాను కానీ, అతని డైరెక్షన్‌లో అయితే చేయనని చెప్పా. చక్రి కథ చెప్పడానికి వచ్చినప్పుడు 'దర్శకుడు ఎవర'ని అతన్నే డైరక్ట్ అడిగా. దాంతో అతను కన్‌ఫ్యూజ్‌ అయ్యాడు. అతనిది క్యారెక్టర్‌ లేని బిహేవియర్‌ అనీ, తిక్కతిక్కగా ప్రవర్తిస్తాడనీ చాలామంది చెప్పడం వల్ల ఆ సంగతి అతనితోనే అని, 'నీతో అయితే పనిచేయను' అని చెప్పా.

అయితే ఇవాళ చక్రి గురించి అలా అనుకున్నందుకు, అలా అన్నందుకు బాధపడుతున్నా. ఆ మాటల్ని ఉపసంహరించుకుంటున్నా. కథని ఎంత ఇన్‌స్పైరింగ్‌గా చెప్పాడో, అంత ఇన్‌స్పైరింగ్‌గా సినిమా తీశాడు. నేనూహించిన దానికి భిన్నంగా అతను ఎంతో పాజిటివ్‌గా వ్యవహరించాడు. అని పొగడ్తలు ప్రారంభించాడు. ఇక హీరోయిన్‌ మమతా మోహన్‌దాస్‌ చేసిన హాట్ సాంగ్ గురించి చెబుతూ నేను వల్గర్‌ సాంగ్స్‌ చేయను.

ఆ పాట మా అందరికీ నచ్చింది. అందులో వల్గారిటీ లేదు. నా భార్యకు కూడా ఆ పాట చూపించా. తనకీ అది నచ్చింది. ఆ పాటలో నాకూ, మమతకూ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయింది. ఓ విషయం చెప్పమంటారా.. ఇందులో మామధ్య చక్కని లవ్‌ స్టోరీ కూడా వుంది. సినిమా షూటింగంతా అయ్యాక సీన్‌ ఆర్డర్‌ మార్చమని తాను చేసిన సూచనని చక్రి పాటించాడని దిల్‌ రాజు చెప్పారు.

జె.డి. చక్రవర్తి తె లుగులో తొలిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రేయ ప్రొడక్షన్స్‌ పతాకంపై కిరణ్‌కుమార్‌ కోనేరు నిర్మించారు. శ్రీ వెంకటేశ్వరా ఫిలిమ్స్‌ అధినేత దిల్‌ రాజు పంపిణీ చేస్తున్న ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X