»   » విశాల్ కి విలన్ గా జగపతి బాబు: భారీ యాక్షన్ చిత్రం లో విలన్ గా జగ్గూ భాయ్

విశాల్ కి విలన్ గా జగపతి బాబు: భారీ యాక్షన్ చిత్రం లో విలన్ గా జగ్గూ భాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి సూపర్‌హిట్‌ చిత్రాల తర్వాత రాయుడుతో మరో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టిన మాస్‌ విశాల్‌ కొత్త చిత్రం జూన్‌ 9 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటుంది. "రాయుడు" వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని ఇచ్చిన జి.హరి హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ఈ భారీ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర విశేషాలను నిర్మాత జి.హరి తెలియజేస్తూ - "భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో చేస్తున్న స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. నిర్మాతగా నాకు చాలా ప్రెస్టీజియస్‌ మూవీ అవుతుంది. విశాల్‌ కెరీర్‌లో ఇది చాలా హై రేంజ్‌ మూవీగా నిలుస్తుంది. షూటింగ్‌ స్టార్ట్‌ అవ్వకముందే ఈ సినిమాకి మంచి క్రేజ్‌ వచ్చింది. విశాల్‌తో నేను చేసిన "రాయుడు" భారీ ఓపెనింగ్స్‌ సాధించడమే కాకుండా రిలీజ్‌ అన్ని సెంటర్స్‌లో సూపర్‌హిట్‌ టాక్‌తో దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది.

"రాయుడు" సూపర్‌హిట్‌ అయిన ఈ ఆనంద సమయంలో విశాల్‌తో స్ట్రెయిట్‌ సినిమా ఎనౌన్స్‌ చెయ్యడం మరింత ఆనందంగా వుంది. ఈ సినిమా కోసం విశాల్‌ కూడా చాలా స్పెషల్‌ కేర్‌ తీసుకుంటున్నారు. విశాల్‌, తమన్నా జంట ఈ సినిమాకి స్పెషల్‌ హైలైట్‌ అవుతుంది. ఇందులో జగపతిబాబుగారు మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారు. అలాగే తరుణ్‌ అరోరా మరో విలన్‌గా చేస్తున్నారు.

Jagapathi Babu to team up with visal

ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన పాటల రికార్డింగ్‌ పూర్తయింది. జూన్‌ 9 నుంచి నెలరోజులపాటు హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతుంది. మిగతా షెడ్యూల్స్‌ చెన్నై, ఫారిన్‌లలో చేస్తాం" అన్నారు.

విశాల్‌, తమన్నా, జగపతిబాబు, నిరోషా, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, సూరి, తరుణ్‌ అరోరా తదితరులు ముఖ్యపాత్రలు పోషించే ఈ చిత్రానికి సంగీతం: హిప్‌ హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్స్‌, ఎడిటింగ్‌: సెల్వ, ఫైట్స్‌: దినేష్‌, అనల్‌ అరసు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: ఆర్‌.జి.ప్రేమానందన్‌, సహనిర్మాతలు: ఎం.పురుషోత్తం, ఇ.కె.ప్రకాష్‌, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్‌.

English summary
Jagapathi Babu to play villain in Vishal's kathi Sandai
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu