కరోనాకు కృతజ్ఞతలు చెప్పిన జగపతిబాబు.. ఎంత పెద్ద స్టార్ అయినా తగ్గాల్సిందే..

టాలీవుడ్ సీనియర్ నటులలో ఒకరైన జగపతిబాబు కాలానికి తగ్గట్లుగానే నటనను కూడా మార్చేస్తున్నాడు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న జగపతిబాబు అనంతరం మెల్లగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా సరికొత్తగా ఆకట్టుకుంటున్నాడు. ఇక ఆయన ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. ఇటీవల ఆయన కోవిడ్ కు థాంక్స్ అంటూ పోస్ట్ చేసిన ఒక ఫొటో కూడా వైరల్ గా మారింది.

 జాగ్రత్తలు తీసుకుంటూ..

జాగ్రత్తలు తీసుకుంటూ..

గత ఏడాది కరోనా కారణంగా దాదాపు 8 నెలలు కొంతమంది నటీనటులు కెమెరా ముందుకు వెళ్లలేదు. షూటింగ్స్ చేయడానికి కంగారు పడ్డారు. ఇక సాధారణంగా మారిపోయిన క్రమంలో పాజిటివ్ భారిన పడిన వారు కూడా కొలుకొని యధావిధిగా షూటింగ్స్ లలో పాల్గొంటున్నారు. ఇక జగపతిబాబు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ పనులను ముగించుకుంటున్నారు.

పాత్ర నచ్చితే తక్కువ రెమ్యునరేషన్

పాత్ర నచ్చితే తక్కువ రెమ్యునరేషన్

నటన కోసం ఎంత కష్టమైన ఇష్టంగా భరించే అతికొద్ది నటీనటులతో జగపతిబాబు ఒకరు. షూటింగ్ కు టైమ్ కు రావడమే కాకుండా అవసరమైతే ఎక్కువ సమయం కూడా కేటాయిస్తారు. పాత్ర నచ్చితే తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా కూడా చేస్తారని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది.

కోవిడ్ కు కృతజ్ఞతలు

కోవిడ్ కు కృతజ్ఞతలు

ఇక కోవిడ్ అనంతరం నటనతో బిజీగా ఉన్న వారిలో జగపతిబాబు కూడా ఉన్నారు. అయితే కరోనా కోవిడ్ అనగానే కొంతమంది చాలా చిరాకు వస్తోంది. కానీ జగపతిబాబు మాత్రం ఆ మహమ్మారికి థాంక్స్ చెబుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. కరోనా టైమ్ లో చాలా వరకు సినీ స్టార్స్ అసిస్టెంట్స్ అవసరం లేకుండా ఎవరు పనులు వాళ్ళే చేసుకుంటున్నారు.

Recommended Video

Akhanda Vs Acharya Vs Narappa, హీరోల లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా !
మరొకరి అవసరం లేకుండా

మరొకరి అవసరం లేకుండా

ఇక జగపతిబాబు కూడా షూటింగ్స్ లో వీలైనంత వరకు మరొకరి అవసరం లేకుండా పనులను పూర్తి చేసుకుంటున్నారు. ఈ కరోనా కారణంగా సొంతంగా తనకు తానే మేకప్ మ్యాన్ గా మారిపోయానని ఒక ఫొటో కూడా షేర్ చేశారు. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ స్టార్ పుష్ప సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. అలాగే రిపబ్లిక్, మహాసముద్రం, లక్ష్య వంటి సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X