»   » జూ ఎన్టీఆర్ సినిమాలో జగపతి బాబు, విలన్?

జూ ఎన్టీఆర్ సినిమాలో జగపతి బాబు, విలన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య హీరోగా వచ్చిన ‘లెజెండ్' మూవీతో విలన్‌గా టర్న్ అయిన జగపతి బాబు విలన్ పాత్రలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. లింగా చిత్రంలో కూడా ఆయన విలన్ పాత్ర పోషించారు. అనంతరం ‘రా రా కృష్ణయ్య', ‘పిల్లానువ్వులేని జీవితం' వంటి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేసిన ఆయన మహేష్ సినిమాలో తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా సుకుమార్, జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించబోయే చిత్రంలో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అయితే అది విలన్ పాత్రనా? లేక మరేదైనా పాత్రనా? అనేది తెలియాల్సి ఉంది.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Jagapathi Babu to team-up with Jr.NTR

ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది 25 వ చిత్రం. మార్చి 3 న భారీగా లాంచ్ కానుంది. వచ్చే ఏడాది అంటే... జనవరి 8, 2016న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి షెడ్యూల్ చేసారు. నవంబర్ దాకా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోనుందని చెబుతున్నారు.

ఈ సినిమా గురించి సుకుమార్ ఆ మధ్య మాట్లాడుతూ .. ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ చిత్రానికి పని చేయబోతుండటం విశేషం.

English summary
Actor Jagapathi Babu has been approached for upcoming movie under the direction of Sukumar, in which Young Tiger Jr. NTR is playing the lead role.
Please Wait while comments are loading...