twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీడియో: బయిటకు వచ్చేసి, క్షమాపణ చెప్తూ జగపతిబాబు

    By Srikanya
    |

    హైదరాబాద్: కాన్సర్‌పై ప్రజల్లో అవగాహన తీసుకురావడమే లక్ష్యంగా ప్రముఖ నటి గౌతమి 'లైఫ్‌ ఎగైన్‌' పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. అందులో భాగస్వామిగా ఉంటూ వచ్చారు జగపతిబాబు. అయితే ఆయన ఇప్పుడు ఆ సంస్ద నుంచి వైదొగిలినట్లు ప్రకటించారు.

    ఈ సందర్బంగా ఆయన క్షమాపణలు చెప్తూ ...ఫేస్ బుక్ లో ఓ వీడియోని రిలీజ్ చేసారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు. అయితే ఎందుకు ఆయన బయటకు వచ్చారనే కారణం మాత్రం చెప్పలేదు.

    Hello everybody, I regret to inform with that I am not a part of LIFE AGAIN organisation anymore... Please understand

    Posted by Jaggu Bhai on 1 March 2016

    ఈ సంస్ద ప్రారంభ సమయంలో మమతా మోహన్ దాస్, జగపతిబాబు హాజరయ్యారు. అంతేకాదు ఈ మధ్యన కమల్ హాసన్ సైతం లైఫ్ ఎగైన్ వరల్డ్ వైజ్ కాంపైన్ సైతం నిర్వహించారు.

    క్యాన్సర్‌తో పోరాడి విజయం సాధించిన ఆమె ఆ వ్యాధిపై ప్రజల్ని చైతన్యం చేసే దిశగా వివిధ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ‘వన్ ఫర్ వన్.. వి ఆర్ దేర్ ఫర్ ఎవ్రీ వన్' (ఒకరికి ఒకరం, అందరికోసం మనం) అన్న అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో క్యాన్సర్ పై పొరాడెందుకు ఓ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు.

    ఇటీవల షికాగోలో లైఫ్‌ ఎగైన్‌ తరపున ప్రపంచస్థాయి అవగాహన శిబిరాన్ని నటుడు కమల్‌హాసన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నటి మమతా మోహన్‌ దాస్‌, హైమారెడ్డి, జగపతిబాబు, ఉత్తర్‌ప్రదేశ్‌ ఎంపీ గాయత్రి ప్రసాద్‌ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Jagapathi took Facebook to convey the message through a video, in which he apologized all and regrets to say that he is not a part of Life again organisation anymore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X