twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కసాయి కసబ్ కథ ( 'చట్టం' నీ అబ్బ సొత్తా ప్రివ్యూ)

    By Srikanya
    |

    జగపతిబాబు తాజా చిత్రం 'చట్టం' 'నీ యబ్బ సొత్తా"ఈ రోజు(శుక్రవారం) విడుదల అవుతోంది. గతంలో తమ్ముడు వంటి సూపర్ హిట్ చిత్రం రూపొందించిన అరుణ్ ప్రసాద్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసారు. చిన్న చిత్రాల పెద్ద నిర్మాత నట్టికుమార్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసారు. కథ విషయానికి వస్తే... లంచగొండి పోలీస్‌ అధికారి గౌరీ శంకర్‌ (జగపతిబాబు). ముంబయి దాడులకు కారణమైన ఉగ్రవాది హసబ్‌ని చంపడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఇతడికి ఏరోబిక్‌ సెంటర్‌ నిర్వహించే యువతి సింధు (విమలారామన్‌) సహాయపడుతుంది. వీరిద్దరూ కలిసి చివరికి ఏ విధంగా హసబ్‌ని అంతం చేశారనేది చిత్ర కథ. గౌరీ శంకర్‌ ఏ పరిస్థితుల్లో మంచివాడిగా మారాడనేది కథలో కీలకమైన విషయం.

    ఈ చిత్రంలో కథ మనం నిత్యం చూస్తున్నదే. రోజువారీ పేపర్లు చదివేవారికి ఈ సినిమా చూస్తుంటే కచ్చితంగా వారికి తెలిసిన విషయాలే కనపడతాయి ... ప్రజా సంక్షేమం, క్రమబద్ధమైన పరిపాలన కోసమే చట్టాలు ఏర్పాటైయ్యాయి. కొంతమంది వ్యక్తులకు చట్టాన్ని అతిక్రమించడం ఓ అలవాటుగా మారింది. అక్రమాలకీ, దుర్మార్గాలకీ పాల్పడి కూడా తప్పించుకొంటున్నారు. కాబట్టే సామాన్య ప్రజలకు చట్టంపై నమ్మకం పోతుంది. ఓ పోలీస్‌ అధికారి చట్టాన్ని రక్షించే క్రమంలో చేసిన పోరాటాలేంటో తెర పైనే చూడాలంటున్నారు దర్శకుడు. ఇటీవల ముంబయి తాజ్ హోటల్ అల్లర్ల నేపథ్యంలో ఈ చిత్ర కథను అల్లుకున్నాం. కసబ్, అతని అనుచరులు కలిసి హోటల్లో ఎంతమందిని మారణహోమంలో పొట్టనపెట్టుకున్నదీ మనకు తెలిసిందే. అప్పుడు ప్రతి భారతీయుడు కసబ్‌ను శిక్షించాలని అనుకున్నవాడే. ఈ చిత్రం ప్రతి భారతీయుడిని కదిలిస్తుందని నమ్ముతున్నామని దర్శకుడు పి.అరుణ్ ప్రసాద్ తెలిపారు.

    సంస్థ: విశాఖ టాకీస్‌
    నటీనటులు: జగపతిబాబు, విమలారామన్‌, ఆశాషైనీ, మురళీశర్మ, రావు రమేష్‌, చలపతిరావు, అమిత్‌ ధావన్‌, జీవా తదితరులు
    నిర్మాతలు: నట్టికుమార్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ
    సంగీతం: ఎమ్‌.ఎమ్‌.శ్రీలేఖ
    దర్శకత్వం: పి.ఎ.అరుణ్‌ప్రసాద్‌

    English summary
    Jagapathi Babu’s latest telugu cinema ‘Chattam… Nee Abba Sottha' releasing today. Vimala Raman is playing Female lead in this film.P.A.Arun Prasad directed this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X