కసితోనే కసబ్ ని తెరకక్కించాం..పవన్ డైరక్టర్
ఇటీవల ముంబయి తాజ్ హోటల్ అల్లర్ల నేపథ్యంలో ఈ చిత్ర కథను అల్లుకున్నాం. కసబ్, అతని అనుచరులు కలిసి హోటల్లో ఎంతమందిని మారణహోమంలో పొట్టనపెట్టుకున్నదీ మనకు తెలిసిందే. అప్పుడు ప్రతి భారతీయుడు కసబ్‌ను శిక్షించాలని అనుకున్నవాడే. ఈ చిత్రం ప్రతి భారతీయుడిని కదిలిస్తుందని నమ్ముతున్నామని దర్శకుడు పి.అరుణ్ ప్రసాద్ తెలిపారు. ఆయన తాజా చిత్రం చట్టం గురించి మాట్లాడుతూ ఇలా స్పందించారు. కెరీర్ ప్రారంభంలో పవన్ కళ్యాణ్ తో తమ్ముడు వంటి సూపర్ హిట్ ఇచ్చిన అరుణ్ ప్రసాద్ తర్వాత కాలంలో వరస ఫ్లాపులు తీస్తూ ప్రస్తుతం నట్టికుమార్ వంటి నిర్మాతతో ఈ చిత్రం రూపొందించారు. జగపతి బాబు హీరోగా చేస్తున్న ఈ చిత్రం ఈ నెల ఇరవై ఐదవ తేదిన విడుదలకానుంది. జగపతి బాబు, విమలారామన్ జంటగా నటిస్తోన్న చిత్రం 'చట్టం' 'నీ యబ్బ సొత్తా". పిఎ అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. నట్టి కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతలు.
అలాగే ఈ చిత్రం కథ గురించి చెబుతూ.. ఈ చిత్రంలో కథ మనం నిత్యం చూస్తున్నదే. రోజువారీ పేపర్లు చదివేవారికి ఈ సినిమా చూస్తుంటే కచ్చితంగా వారికి తెలిసిన విషయాలే కనపడతాయి ... ప్రజా సంక్షేమం, క్రమబద్ధమైన పరిపాలన కోసమే చట్టాలు ఏర్పాటైయ్యాయి. కొంతమంది వ్యక్తులకు చట్టాన్ని అతిక్రమించడం ఓ అలవాటుగా మారింది. అక్రమాలకీ, దుర్మార్గాలకీ పాల్పడి కూడా తప్పించుకొంటున్నారు. కాబట్టే సామాన్య ప్రజలకు చట్టంపై నమ్మకం పోతుంది. ఓ పోలీస్ అధికారి చట్టాన్ని రక్షించే క్రమంలో చేసిన పోరాటాలేంటో తెర పైనే చూడాలన్నారు. జీవా, రావు రమేష్, మురళీశర్మ, బ్రహ్మానందం, వేణుమాధవ్, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్ తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: ఎమ్.ఎమ్.శ్రీలేఖ.


Click it and Unblock the Notifications