తెలంగాణ కోసం అమరుడయ్యే జగపతి బాబు
మా సినిమాలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం అమరుడయ్యే తెలంగాణావాదిగా జగపతిబాబు ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాల్గొన్న సన్నివేశాలను వరంగల్, కరీంనగర్, ఉస్మానియా యూనివర్సిటి, కాకతీయ యూనివర్సిటిల్లో చిత్రీకరించాం అంటున్నారు దర్శకుడు ఎన్.శంకర్. స్వీయదర్శకత్వంలో మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న 'జై బోలో తెలంగాణ' చిత్రం షూటింగ్ ప్రోగ్రెస్‌ను మీడియాకు ఎన్.శంకర్ వివరిస్తూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే ఇప్పటివరకూ నాలుగు పాటలతో ఎనభై శాతం టాకీ పార్ట్ పూర్తయింది. మిగిలిన సన్నివేశాలను ఈ నెలాఖరులోగా చిత్రీకరించి డిసెంబర్ చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.
అలాగే..తెలంగాణ ఉద్యమంతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమాన్నీ మా చిత్రంలో చూపిస్తాం. ఈ ఉద్యమాల్ని నిష్పాక్షికంగా, ఒక జర్నలిస్టిక్ వ్యూతో చూపించబోతున్నాం. కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఇందులో కనిపిస్తాయి. ఈ చిత్రానికి చక్రి సంగీతాన్ని సమకూరుస్తున్నారు అన్నారు. ఇక ఈ చిత్రంలో మిగతా పాత్రల్లో స్మృతి ఇరాని, లక్షయ్య, గౌరీశంకర్, విద్యాసాగర్, డాక్టర్ శ్రావణ్‌కుమార్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: ఉడుగుల వేణు, పాటలు: అందెశ్రీ, సుద్దాల అశోక్‌తేజ, గోరేటి వెంకన్న, సందిని సిద్ధారెడ్డి, సంగీతం: చక్రి, కథ, నిర్మాత, దర్శకత్వం: ఎన్.శంకర్.


Click it and Unblock the Notifications











