అదేంటో గాని..జగపతి బాబు తో ఒకసారి జోడి కడితే చాలు కంటిన్యూ అవుతుంది.ప్రస్తుతం మమతా మోహన్ దాస్,జగపతి బాబు కలిసి ది డిపార్టడ్ ఆధారంగా జె.డి.చక్రవర్తి దర్శకత్వంలో తయారవుతున్న హోమం లో నటిస్తున్నారు.అంతే కాకుండా పి.వాసు దర్శకత్వంలో రెడీ అవుతున్నక్రేజీ ప్రాజెక్టు కుచేలుడు లో ఈ జంట రిపీట్ అవుతోంది.అలాగే జగపతి మరో కొత్త సినిమాలోనూ మమత మోహన్ దాస్ పేరుని పరిశీలుస్తున్నారు.గతంలోనూ ఇలాగే కళ్యాణి తో వరస సినిమాలు వచ్చాయిహిట్ పెయిర్ అయితే ఇలా జరగటం కామన్ కాని..రిలీజు కాకుండానే కాంబినేషన్ వన్స్ మోర్ అంటే అర్ధమేంటి కొందరు అంటున్నారు ...ఆరా తీస్తున్నారు.ఏం అల్లరి నరేష్ సినిమాలలో ఫర్జానా వరసగా బుక్కవటం లేదా ఇదీ అంతే అని మరి కొందరు సర్దిచెప్పుతున్నారు.
Story first published: Saturday, April 18, 2026, 20:06 [IST]