ఎన్టీఆర్ సినిమాలో జగపతి బాబుకీ రోల్

By Srikanya

నందమూరి తారకరత్న రీసెంట్ గా తన పేరుని 'ఎన్టీఆర్"గా మార్చుకుని 'నందీశ్వరుడు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో జగపతి బాబు పోలీస్ ఆఫీసర్ గా ఓ ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూనిర్మాతల్లో ఒకరైన గంగాధర్‌ రెడ్డి కోట ఆ వివరాలు చెబుతూ 'ఈ మధ్యకాలంలో మల్టీ స్టారర్ చిత్రాలు కొన్ని వస్తున్నప్పటికీ ఆ స్టార్స్ కాంబినేషన్ సీన్లు ఎక్కువగా ఉండటం లేదు. కానీ మా సినిమాలో ఎన్టీఆర్, జగపతి బాబు కాంబినేషన్ ఎపిసోడ్స్ అద్భుతంగా వచ్చాయి. ఇద్దరి మధ్య మంచి డైలాగ్ డ్రామాతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ఈ నెల పదో తేదితో టాకీ పార్ట్ పూర్తవుతుంది. 15 నుంచి పాటలను చిత్రీకరించి డిసెంబర్ మూడో వారంలో సినిమాను విడుదల చేస్తాం'అన్నారు.

చిత్ర దర్శకుడు అంజి శీను మాట్లాడుతూ ' తారకరత్న, జగపతి బాబు కాంబినేషన్‌లో వచ్చే ఒక్కో సన్నివేశం ఓ బ్లాస్టింగ్‌లు ఉంటుంది. పోలీసింగ్‌కు, సివిల్‌ పోలీసింగ్‌కు మధ్య జరిగే గొప్ప ఐడియాలజీ కాన్‌ఫ్లిక్ట్ ఈ సినిమాకు మూలం. 'డెడ్లీ సోమా' అనే కన్నడ చిత్రం ఆధారంగా ఈ సినిమా తయారవుతోంది. పార్థుని సంగీత దర్శకునిగా పరిచయం చేస్తున్నాం'అన్నారు. ఈ 'ఎన్టీఆర్" ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన షీనా హీరోయిన్ గా నటిస్తోంది. రచయితలు పరుచూరి బ్రదర్స్ మాట్లాడుతూ -''కన్నడంలో సూపర్‌హిట్ అయిన 'డెడ్లీ సోమా" ఆధారంగా రూపొందుతోన్న చిత్రమిది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలకు రచన చేస్తున్నప్పుడు మేం ఎంత భావోద్వేగానికి లోనయ్యామో ఈ 'నందీశ్వరుడు"కి పనిచేసేటప్పుడు కూడా అలాంటి అనుభూతినే పొందాం. ఇందులో తారకరత్న నట విశ్వరూపం చూస్తారు""అని చెప్పారు. ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యువరాజ్, నిర్మాతలు: గంగాధరరెడ్డి కె, సేగు రమేష్‌బాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X