జగపతిబాబు 'బ్లాక్‌మనీ' పూర్తి డిటేల్స్...
జగపతిబాబు,నట్టికుమార్ కాంబినేషన్ లో 'బ్లాక్‌మనీ' అనే టైటిల్ తో మరో చిత్రం ప్రారంభం కానుంది. ఈ నెల 18న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది.ఈ సినిమాకు పూసల రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తారు. ఓ ప్రముఖ హీరో గెస్ట్ రోల్ ను పోషించే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారు. మేలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే జగపతిబాబు హీరోగా అరుణ్‌ప్రసాద్ దర్శకత్వంలో విశాఖ టాకీస్ బేనరుపై నట్టి కుమార్ ప్రస్తుతం 'చట్టం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణకార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల 26న ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
జగపతిబాబు బ్లాక్ మనీ అరుణ్ ప్రసాద్ చట్టం నట్టికుమార్ jagapathi babu black money arun prasad chattam natti kumar


Click it and Unblock the Notifications