'జగపతి నీ కాళ్లు పట్టుకుంటా..ప్లీజ్' అంటూ వర్మ
బాబూ జగపతి నీ కాళ్లు పట్టుకుంటా..కాస్త ఆ కిడ్ ని చంపేయవయ్యా అని వర్మ నన్ను చాలా ఫోర్స్ చేసారు అంటున్నారు జగపతిబాబు. ఆయన గాయం 2 ప్రమోషన్ లో భాగంగా ఉదయభాను ఏంకిరింగ్ చేసిన ఓ టీవీ పోగ్రామ్ కి అటెండయ్యారు. ఆ సందర్భంగా ఇలా స్పందించారు. గాయం2 చిత్రంలో ఉన్న జగపతిబాబు కొడుకు పాత్రని రామ్ గోపాల్ వర్మ చంపేయమని, అప్పుడే కిక్ వస్తుందన్నారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే తాను ఒప్పుకోలేదని, కిడ్ చచ్చిపోతే..ఇంక దుర్గ వచ్చి ఫలితమేముంటుందని తాను వాదించి గెలచానన్నారు. అలాగే అంతకుముందు తనను..మధ్యాహ్నం హత్య సినిమా చేయమని వర్మ అన్నారని..తాను భార్యని చంపటమేమిటని, అలా చేస్తే తాను తన సొంత చేతులతో తన కెరిర్ ని హత్య చేసినట్లవుతుందని చెప్పానని జగపతి అన్నారు.
అప్పడు వర్మ..నీకెప్పుడూ నీ భార్యని చంపాలనిపించలేదా అని అడిగారని..అసలు అలాంటి ఆలోచన తనకెప్పుడూ రాలేదని చెప్పానని, అయినా ఇలా భార్యని చంపు, కొడుకు చంపు అని తనని చంపితే కష్టమని చెప్పానని నవ్వుతూ చెప్పారు. ఇక ఆ పాత్రని జెడి చక్రవర్తి చేసాడని, ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ, జెడీ ఇద్దరూ..క్షమాపణలు చెప్పుకున్నారని చెప్పారు. ఇక గాయం-2 చిత్రం చేస్తానని తను ప్రపోజల్ పెట్టగానే రామ్ గోపాల్ వర్మ...ఎప్పుడో 17 సంవత్సరాల క్రిందటి సినిమా ఎవరు గుర్తుంచుకుంటారని అన్నారని..నువ్వు బొంబాయి వెళ్లి సినిమాలు చేసుకుంటున్నావు గానీ ఇక్కడ జగపతిబాబు అంటే గాయం అనేది ఇంకా గుర్తు ఉందని తాను చెప్పి ఒప్పించానని అన్నారు. అలాగే గాయం సీక్వెల్ అనటం వల్ల ఓపినింగ్స్ వస్తాయనేది తన ఆలోచన అని..అదే నిజమైందని, అలాగే కథలో పిల్లాడని చంపకపోవటమే సినిమాకు కలిసి వచ్చి ఇంత పెద్ద విజయానికి దోహదం చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇంతకీ గాయం 2 హిట్టేనన్నమాట.


Click it and Unblock the Notifications











