కృష్ణవంశీ 'అంతఃపురం' సీక్వెల్ కి రంగం సిద్దం
త్వరలో 'అంతఃపురం' సీక్వెల్ కూడా చేయబోతున్నా. దానికి సంబంధించిన కథను నేనే తయారు చేసుకున్నాను. ఆ వివరాలు త్వరలో చెబుతా అంటున్నారు జగపతి బాబు. ఆయన తాజా చిత్రం గాయం సీక్వెల్ 'గాయం-2' ప్రమోషన్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. సౌందర్య, ప్రకాష్ రాజ్, జగపతిబాబు కాంబినేషన్ లో వచ్చిన ఆ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. అందులో ప్రత్యేకంగా జగపతిబాబు చేసిన పాత్ర మాస్ ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. ఇక ఆ చిత్రాన్ని మరి కృష్ణ వంశీ డైరక్ట్ చేస్తారో లేక కృష్ణవంశీ శిష్యుడు ఎవరన్నా రెడీగా ఉన్నారో చూడాలి.


Click it and Unblock the Notifications











