విలన్ గానూ నటిస్తా: జగపతిబాబు

By Staff

Jagapathi Babu
విలన్ పాత్రలు పోషించడానికైనా సిద్దమేనని తెలుగు సినీ హీరో జగపతిబాబు అంటున్నాడు. స్వాగతం సినిమా విడుదల సందర్భంగా ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఈ విషయం చెప్పాడు. ఇప్పటి వరకు 75 సినిమాలు చేసిన ఆయన ఇక నుంచి పాత్రలేవైనా బలమైనవి అయితే నటించడానికి సిద్ధమేనని, పది నిమిషాల పాత్రలైనా చేస్తానని, ఇంకెంత కాలం సినిమా అంతటా తనను తానే చూసుకోవడం అని ఆయన అన్నారు. రజనీ సరసన నటించే అవకాశం లభించినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి నటుడితోనే కాకుండా ఒక మంచి వ్యక్తితో కలిసి నటించే అవకాశం లభించిందని ఆయన అన్నారు. రజనీయే తనతో నటించాలని తనను అడిగారని, అది మరింత ఆనందకరమైన విషయమని ఆయన అన్నారు. రజనీకాంత్, జగపతి బాబు నటించే ఆ సినిమాకు కుచేలుడు అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.

స్వాగతం ప్రొడక్షన్ బాధ్యతలను కూడా నిర్వహించిన జగపతి బాబు ఆ పని తనకెంతో ఆనందాన్నిచ్చిందని అంటున్నారు. తనది ఈ సినిమాలో వాణిజ్యవేత్త పాత్ర అని, ఆ సీరియస్ నెస్ లో కామెడీని పండించడం జరిగిందని ఆయన చెప్పారు. మావిచిగురు వరుసలో ఈ సినిమా వస్తుందని ఆయన చెప్పుకున్నారు. మావిచిగురు కన్నా క్లాస్ గా ఇది ఉంటుందని ఆయన అన్నారు. ఆర్పీ పట్నాయక్ అందించిన పాటలు బాగా వచ్చాయని, అన్ని కూడా సిచ్యుయేషన్ పాటలేనని ఆయన అన్నారు. భూమిక నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X